ఎన్నికలు , అధికారులు,
Kura Yadaiah|December 11,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :-


Election update| మొదటి విడత పోలింగ్ లో భాగంగా మంచన్పల్లి పోలింగ్ బూతులు ఎన్నికల అబ్జర్వర్ యాస్మిన్ భాష ఐఏఎస్ శ్రీనివాస్ రెడ్డి డి ఆర్ డి ఓ సందర్శించి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు…….
Election update|పెద్దేముల్ :- వికారాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. అందులో భాగంగా పెద్దేముల్ మండల్ మన్సాన్పల్లి పోలింగ్ బూత్ ను ఎన్నికల అబ్జర్వర్ యాస్మిన్ భాష ఐఏఎస్ ,శ్రీనివాస్ డిఆర్డిఓ సందర్శించారు. మంచన్పల్లి గ్రామంలో జరుగుతున్న ఓటింగ్ సరళిని ఓటింగ్ వివరాలను బందోబస్తు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఓటర్లతో మాట్లాడి జరుగుతున్న పరిణామాలను వివరాలను తెలుసుకున్నారు.
