పోలీసు
Kura Yadaiah November 27,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :-


Vkb| అభ్యర్థులు మెడిటేషన్ వ్యాయామాలు అలవాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు…
Police vkb| వికారాబాద్ :- అభ్యర్థులు మెడిటేషన్ వ్యాయామం క్రమశిక్షణ పారాదర్శకత పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా అన్నారు. సందర్భంగా గురువారం రోజు మల్టీ జోన్ || పరిధిలో ఏఆర్ ఎస్సై (ఏఆర్) లకు ఆర్ఎస్ఐ (ఏ ఆర్) లుగా పదోన్నతి కల్పించేందుకు ఏర్పాటు చేసిన డిపార్ట్మెంటల్ క్వాలిఫైయింగ్ పరీక్షల శారీరిక సామర్ధ్య కార్యక్రమా న్ని పరిశీలించి ఈ సందర్భంగా అన్నారు. పరీక్షల నిర్వహణ తీరును అభ్యర్థుల భాగస్వామ్యాన్ని ఆమె పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో క్రమశిక్షణ పారదర్శకత చాలా ముఖ్యమని అభ్యర్థులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆమె గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ యోగ మెడిటేషన్ వ్యాయామాలు మానసికంగా బృఢంగా ఉండాలి అంటే ఇవన్నీ అవసరమేనని ఆమె తెలిపారు. డిపార్ట్మెంటల్ టెస్టు అనేది కేవలం ఉద్యోగంలో ఒక మెట్టు మాత్రమేనని మీ సామర్థ్యాన్ని జ్ఞానాన్ని పెంచుకోవడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం అని ఆమె సూచించారు. బాధ్యతయుతమైన విధులను సమర్ధవంతంగా నిబద్ధతతో నిర్వహించాలని ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు మీ నూతన బాధ్యతలు ఉపయోగపడాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి రాములు నాయక్ డీఎస్పీ వీరేష్ ఆ రైలు ఆర్ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
