బిసి బిల్లు
Kura Yadaiah| December 10,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :-


బీసీ రిజర్వేషన్ బిల్లును తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్, అన్నారు…..
BC reservation|(డిల్లీ):- బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తామన్న బీసీ బిల్లును తక్షణమే పార్లమెంటులో ఆమోదంపై చేసి 9వ, షెడ్యూల్లో చేర్చాలని, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం రోజు ఢిల్లీ కేంద్రంగా జంతర్మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదింప చేసి పార్ల పార్లమెంటుకు పంపించారని దానిని తక్షణమే పార్లమెంటులో బీసీ బీలను ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నరేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్లో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటివరకు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు లేవని వాటిని తక్షణమే బీసీ ఉద్యోగులకు కూడా ప్రమోషన్లు కల్పించాలని అన్నారు. టెన్ కే ర్యాంక్ క్యాప్ విధానాన్ని తొలగించి బీసీ విద్యార్థుల ఫీజు ను ప్రభుత్వ మీ చెల్లించాలని దేశవ్యాప్తంగా సమగ్ర కులగనలను వెంటనే ప్రారంభించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేశారు. తెలంగాణలో జరిగే ఎన్నికలు బీసీలకు నష్టం చేసే విధంగా ఉన్నాయని కాబట్టి మొన్న హైకోర్టు కొట్టి వేసిన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మేకపోతుల నరేందర్ గౌడ్ తెలిపారు.
తాళ్ల రామకృష్ణ, డాక్టర్ రాగ్యా అరుణ్ కుమార్,
దేశంలో బీసీలాంటే పాలకులకు పార్టీలకు అసలు లెక్కలేదని బీసీలు అంటే అసహనం వ్యక్తం చేస్తున్నారని జాతీయ బీసీ మేధావుల సంఘం అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ అన్నారు. దేశంలో ఉన్న అధిక బీసీ జనాభా కలిగిన బీసీలు బాగుపడకుండా దేశం ఎన్నడూ బాగుపడదని బీసీలు దేశంలో బాగుపడాలంటే బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలి అని తెలిపారు. అప్పుడే బీసీలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదుగుతారని డాక్టర్ ర్యాగా అరుణ్ కుమార్ అన్నారు.
