
ఆగస్టు 11న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంద్దామని వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్, కే లలితాదేవి తెలిపారు.
వికారాబాద్ ; ఆగస్టు 11వ తేదీన జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించుకుందామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే లలితా దేవి పత్రిక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లాలోని 1 నుండి 19 సంవత్సరాల వయసు గల, 2,34,632, మంది బాల బాలికలు ఉన్నారని, పాఠశాలలు కళాశాలలో మరియు అంగన్వాడీ కేంద్రాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు బడికి వెళ్ళని పిల్లలకు కూడా 1 నుండి 19 సంవత్సరాల వయసు గల వారందరికీ నులిపురుగు నిర్మూలన టాబ్లెట్ ఆల్బెండజోల్ మాత్ర వేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.
ఈ మాత్రలను వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ,పాఠశాలలు కళాశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాలలో ఆల్బెండజోల్ మాత్రలు వేస్తారని తెలిపారు. కాబట్టి 19 సంవత్సరాల వయసులోపు వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేసే విధంగా పాఠశాల ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని కోరారు.
ఒకవేళ ఆగస్టు 11న మాత్రలు తీసుకోకుండా తప్పిపోయిన పిల్లలు ఎవరైనా ఉంటే ఆగస్టు 18 వ తేదీన వారికి మాత్రలు వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే మనిషి శరీరంలోకి సాధారణంగా నులిపురుగులు కలుషితమైన ఆహారం తినడం వల్ల అపరిశుభ్రంగా ఉన్న చేతుల చేతుల ద్వారా నులిపురుగులు శరీరంలోకి చేరుతాయని తెలిపారు. నులిపురుగులు కలిగిన పిల్లలు రక్తహీనత అలసట బుద్ధిమాంద్యం శారీరిక మానసిక ఎదుగుదల లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి అని దీని వల్ల పిల్లలు చదువులలో ఆటలలో వెనుకబడి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
