రాజకీయం
Kura Yadaiah| December 20,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :-

తాండూర్ నియోజకవర్గంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొంది మాజీ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రోజు తెలంగాణ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు….
తాండూర్:- తాండూర్ నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచులు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.
శనివారం రోజు తాండూర్ నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా ఉపసర్పంచులుగా గెలిచిన అభ్యర్థులు రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అరాచకాలను తట్టుకున్న రోహిత్ రెడ్డి, కేటీఆర్,
కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎదుర్కొని పైలెట్ రోహిత్ రెడ్డి తాండూర్ నియోజకవర్గంలో ఎంత మంది సర్పంచులను గెలుచుకోవడం శుభపరిణామమని ఆయన నిబద్ధతకు ప్రజలకు సేవ చేసిన త్యాగాన్ని ప్రజలు మరువలేరని ప్రజలను రోహిత్ రెడ్డి మరువలేరని స్పష్టంగా ఈ ఫలితాలు చూస్తే అర్థమవుతుందని కేటీఆర్ కొని ఆడారు. రాబోయేది టిఆర్ఎస్ ప్రభుత్వమే అని స్థానిక ఎన్నికలను బట్టి అర్థమవుతున్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రామాలను మంచి గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని సర్పంచులకు ఉపసర్పంచులకు వార్డు సభ్యులకు సూచనలు చేశారు కేటీఆర్. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మీడియా ప్రతినిధి పంచగల శ్రీశైల్ రెడ్డి బషీరాబాద్ తాండూర్ పెద్దేముల్ యలాల్ మండల అధ్యక్ష కార్యదర్శులతో పాటు వార్డు సభ్యులు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

