రాజకీయం
Kura Yadaiah| December 20,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :-

నియోజకవర్గంలో వివిధ మండలాల్లోని గ్రామాలలో గెలుపొందిన సర్పంచులు శనివారం రోజు తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు…..
తాండూర్:- ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు తాండూరు శాసనసభ్యులు బుయని మనోహర్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ధన్యవాదాలు తెలిపిన వారిలో పెద్దెముల్ మండలం కండనెల్లి తండా సర్పంచ్ ఆనంద్ నాయక్, బషీరాబాద్ మండలం పర్శనాయక్ తాండ సర్పంచ్ లక్ష్మీబాయి కోటపల్లి మండలం ఓగులాపూర్ సర్పంచ్ చెన్నాకర్ ,వార్డు సభ్యులు ఉన్నారు. సర్పంచులుగా గెలుపొందిన వారికి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధి దేయంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని వారికి సూచించారు.
