శుభాకాంక్షలు
Kura yadaiah/December 19,2025,
హిందు 9న్యూస్ బ్యూరో :-

తాండూర్ డి.ఎస్.పి నర్సింగ్ యాదయ్యను శుక్రవారం రోజు పెద్దేమల్ మండల్ కందనెల్లి తండా సర్పంచ్ రాథోడ్ ఆనంద్ నాయక్ తన అనుచరులతో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు….
తాండూర్ :- ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో పెద్దేముల్ మండలం కందనెల్లి తండా సర్పంచిగా రాథోడ్ ఆనంద్ నాయక్ గెలుపొందారు. సర్పంచ్ గా ఎన్నికైన రాథోడ్ ఆనంద్ నాయక్ నియోజకవర్గం లోని అధికారులతో పాటు మండల అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మర్యాదపూర్వకంగా తాండూర్ డీఎస్పీని కలిసిన కందనెల్లి తండా సర్పంచ్ రాథోడ్ ఆనంద్ నాయక్,
ఇదే సందర్భంలో శుక్రవారం రోజు తాండూర్ డిఎస్పి నర్సింగ్ యాదయ్యను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డిఎస్పి నూతన సర్పంచి ఆనంద్ నాయక్ ను అభినందించారు. గ్రామాలలో ప్రజలందరితో సఖ్యతగా మెలిగి అందరిని కలుపుకొని శాంతి భద్రతలకు దోహదపడాలని తాండూర్ డిఎస్పి సూచించారు. కార్యక్రమంలో ఆర్ రతన్ సింగ్ డి గోపాల్ ఆర్ నితీష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
