తాండూర్ పంచాయతీ ఎన్నికల్లో పునరుత్తేజం పెంచుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ గ్రామీణ నాయకత్వ వ్యవహార శైలి కారణమా.!

author
0 minutes, 1 second Read

తాండూర్ ,రాజకీయం,

Kura yadaiah/December 20/2025,

హిందు 9న్యూస్ బ్యూరో :-

Reding :-

పంచాయతీ ఎన్నికల్లో తాండూర్ లో హనూహ్యంగా బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందడం బిఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా పునరుద్తేజం తీసుకొచ్చిందని చెప్పొచ్చు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పుంజు కోవడం కాంగ్రెస్ పార్టీకి కొంత సవాలుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. నూతన పరిణామాలను చూస్తే ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందనేది విశ్లేషకులు అంచన వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీ ఎన్నికల పరిస్థితులను చూస్తే పార్టీ నిర్మాణం చెక్కుచెదరకుండా ఉంది అనడానికి ప్రస్తుతం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ గెలిచిన సర్పంచ్ స్థానాలే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అలా అని కాంగ్రెస్ పార్టీకి బలం పంచాయతీ ఎన్నికల్లో పుంచుకోలేదంటే పుంజుకుంది మెజార్టీ స్థానాలను గెలిచి మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది. మూడో స్థానానికి బిజెపి పార్టీ వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ బలాన్ని బలగాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీని 2029లో జరగబోయే ఎన్నికలకు రిప్లేట్ గా  పరిణామాలు మారుతున్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణే, నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలోను ఊహించని రీతిలో గెలుపొంది కాంగ్రెస్ పార్టీని ఆలోచనలో పడేసింది. ముఖ్యంగా బషీరాబాద్ పెద్దేముల్ తాండూర్ మండలాలలో కొంత అధిక మొత్తంలో స్థానాలు గెలుపొంది తమ ఉనికిని చాటుకుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు చిన్నదా అంటే కాదు కాంగ్రెస్ పార్టీ గెలుపు కూడా పెద్దదే కానీ ఎక్కడో కొంత కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తమ క్యాడర్కు దూరమవుతున్నట్లు చూసిన ఫలితాలను బట్టి అర్థమవుతుంది.దీని అంతటికి గ్రామస్థాయిలో ఉన్న పార్టీ నాయకత్వం ప్రజలతో నేరుగా సంబంధాలు  కలిగి ఉండకపోవడం అధికారం ఉంది కదా అని  ప్రజలతో సఖ్యతగా మెలగకపోవడం ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై అసహనం పెంచుకోవడం కక్షపూరిత రాజకీయాలను పులిగోల్పడం కాంగ్రెస్ పార్టీకి తాండూర్ నియోజకవర్గంలో కొంత నష్టాన్ని చారి చూసిందని ఇప్పుడు ప్రజల్లో అక్కడక్కడ చర్చలు జోరందుకున్నాయి. మరి గ్రూపు తగాదాలతో కాంగ్రెస్ పార్టీ అవస్థ పడుతుంది. క్రింది స్థాయి నాయకత్వం ఒకరి మీద ఒకరు దుమ్ము ఎత్తిపోసుకోవడం ఒకరంటే ఒకరు ఒకరు మీద ఒకరు లేనిపోని ఆరోపణలు చేసుకోవడం వాటికి ఇలా కూడా నష్టం చేకూర్చుతుందని బాధనులో వింటున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటిది ఎప్పటినుండి కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని ప్రజల్లో ఒక అసహనాన్ని చూస్తున్నాం.

వీటన్నిటికీ గ్రామస్థాయి నాయకత్వ లక్షణాలలో సంపూర్ణ రాజకీయ అవగాహన లేకపోవడం ఒక  ఒక కారణంగా విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు అంటేనే  పోటీ తత్వమనేది సహజమే ,అలా అని ఇద్దరు గెలవాలంటే సాధ్యపడదు ఎవరో ఒకరు  గెలుపొందగా  మరొకరు  ఓటమి చావి చూడక తప్పదు ఇది సహజ సిద్ధమైనదే.

కానీ కొన్ని గ్రామాలలో ప్రజలను ఓటమికి బాధ్యులను  చేయడం ఆయా నాయకత్వ లు చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకోవడం  ప్రజలతో కలిసి సమైక్యంగా రాజకీయాలు చేయకపోవడం కక్షపూరిత రాజకీయ అవగాహన కలిగి ఉండడం వల్ల ఆయా పార్టీలకు గ్రామాలలో క్యాడర్ను దూరం చేసుకునే పరిస్థితి వస్తుంది. పార్టీలకు పునాది కింది స్థాయి నాయకత్వమే ,కింది స్థాయిలో పార్టీ నాయకత్వాలు అవగాహన రహిత్య రాజకీయాలు చేస్తే పార్టీలు ప్రజలకు దూరమయ్యే పరిస్థితులు మెండుగా ఉంటాయి. గ్రామాలలో మేజర్ నాయకత్వాన్ని కలుపుకొని రాజకీయాలు చేసుకుంటే పార్టీలు ప్రజలకు మరింత దగ్గరయ్యి పార్టీ నిర్మాణాలు బలపడతాయి. దీన్ని అంతటిని పక్కన పెట్టి గ్రామస్థాయి నాయకులు చేసిన పొరపాట్లను సరిదిద్దుకోకుండా ప్రజలను అవమానించడం అసహనానికి గురి చేయడం ప్రజలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం వీళ్ళు ఓట్లు వేయలేదు వాళ్ళు ఓట్లు వేయలేదు వీళ్లకు డబ్బులు ఇచ్చాం వాళ్లకు డబ్బులు ఇచ్చామంటూ ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రజలపై నేపం నెట్టేయడం ప్రజలకు అసహనం పెరిగి పార్టీలకు దూరమయ్యే పరిస్థితులు అనేకం చూసినాం. తాండూర్ నియోజకవర్గంలో అక్కడక్కడ గ్రామస్థాయి నాయకత్వాలు వారి వారి వ్యక్తిగత విషయాలకు తప్ప ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం ప్రజలకు ఆయా పథకాలపై అవగాహన కలిగించకపోవడం కాంగ్రెస్ పార్టీ కిందిస్థాయి నాయకత్వ లోపాలు కావా! అంటే అవునని సమాధానం వినిపిస్తుంది.  ప్రజలకు ఉన్న కష్టాలను ప్రజలకు ఉన్న సమస్యలను గ్రామీణ స్థాయి నాయకత్వం పరిష్కరించకపోవడం ఒకవేళ పరిష్కరించిన ప్రజలను ఎన్నికల అప్పుడు తెప్పిపోవడం ఇవి కూడా పార్టీకి నష్టం చేకూర్చి అంశాలే. రాజకీయాలు అన్నాక గెలుపు కోసం ప్రభ్యర్థి పార్టీలో రకరకాల ఎత్తుగడలను ప్రణాళికలను రూపొందించుకోవడం సహజమే,

అలాంటి ఎత్తుగడలు నియోజకవర్గంలో అక్కడక్కడ కొన్ని గ్రామాలలో ఎత్తుగడలు వేయడంలో  ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రణాళికలను రూపొందించుకోవడంలో విఫలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్రింది స్థాయి నాయకత్వాలు ప్రజలపై అక్కడక్కడ  అనవసర దురుద్దేశాలు పెంచుకొని ప్రజలను దూరం చేసుకోవడమే తప్ప మరొకటి కాదనేది ఆయా నాయకత్వాలకు ప్రజల నుండి వస్తున్న ప్రశ్నలుగా వినిపిస్తున్న మాటలు.

పంచాయతీలుగా గెలుపొందిన?

ఇదొక పరిణామం అయితే మరో అంశం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గెలుపొందిన తర్వాత కూడా గ్రామస్థాయి నాయకత్వం కొన్ని గ్రామాలలో కక్షపూరిత విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నట్లుగా ప్రజల్లో వినిపిస్తున్న మాటలు,  నేరుగా అధికార పార్టీ నాయకులు ప్రజలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మీరు వాళ్లకు సపోర్టు చేశారంటూ వాళ్లు వీళ్లకు డబ్బులు ఇచ్చారంటూ ఆరోపణలు చేస్తూ ప్రజలను దెప్పిపోవడం మనం ప్రస్తుతం అక్కడక్కడ వింటున్నాం. ఇది కూడా రాబోయే జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. గెలుపొందిన తర్వాత ఆయా గ్రామాలలో ప్రజలు అందరూ ఒక్కటే అందరికీ సంక్షేమం అభివృద్ధి అందించడం ఆయా పంచాయితీల కర్తవ్యం బాధ్యతలుగా తీసుకోవాల్సిన అంశాన్ని పక్కన పెట్టి (పోయిన కుందేలు పెద్దదన్నట్టు) జరిగిపోయిన పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో ప్రజలపై ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం మంచిది కాదు.

ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారత రాజ్యాంగం ఎన్నికల కమిషన్ అవకాశాలు కల్పించింది.  పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమకు నచ్చిన వాడికి ఓట్లు వేసుకుని గెలుపు ఓటములను ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజలకు ఆ హక్కు ఆ స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది పక్కనపెట్టి ప్రజలపై నిరాధారమైన ఆరోపణలు ఎంత మాత్రం మంచిది కావు. కార్యకర్తలతో ప్రజలతో నేరుగా నాయకులు సంబంధాలు ఏర్పరచుకొని ముందుకెళ్తే  త్వరలో రాబోయే జెడ్పిటిసి ఎంపిటిసి మున్సిపల్ ఎన్నికలపై  ఇలాంటి ఫలితాలు పునరావృతం కాకపోవచ్చు దానికి తోడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చడం వాటిని ప్రజలకు ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉండాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా బలపడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ పైన ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రామస్థాయి నాయకులు తమ వ్యవహార శైలిని తమ మాట తీరును రాజకీయ పరిజ్ఞానాన్ని మంచితనాన్ని పెంచుకుని ప్రజలను తమ వైపు తిప్పుకొనే ప్రణాళికలు రూపొందించుకుంటే తప్ప మళ్ళీ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో  జరిగినట్టు  ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో జరగకుండా జాగ్రత్త పడొచ్చు అనేది సామాజిక ఉద్యమకారుల సామాజిక వెత్తల అభిప్రాయంగా వినిపిస్తున్న మాట. ఏది ఏమైనా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలవడం వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తామన్న నమ్మకాన్ని కార్యకర్తల్లో  జోష్ ను పెంచింది. నియోజకవర్గంలో ఈ రెండు పార్టీల మధ్య యుద్ధం ఇప్పుడే మొదలయ్యిందా.!

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *