
పేదలకు సేవ చేయడమే నా ప్రధాన లక్ష్యం అని కోటపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాయిని నారాయణరెడ్డి తెలిపారు….
పెద్దేముల్: గత రెండు రోజుల కిందట పెద్దేముల్ మండల్ మంబాపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఎండి ఇమామ్ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఏఎంసి వైస్ చైర్మన్ సాయిని నారాయణరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఇమామ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వారి కుటుంబానికి 500 ఆర్థిక సాయం అందచేసి తన దాతృత్వాన్ని మానవతా వాదాన్ని చాటుకున్నారు. పేదల పక్షాన పేదల కష్టసుఖాల లో పాలుపంచుకోవడం వారిని వెన్నుతట్టి అభివృద్ధి దిశగా ప్రోత్సహించడం బాధలో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడి ధైర్యాన్ని ఇవ్వడం ఎంతో ఆత్మ సంతృప్తిని కలిగిస్తుందని నారాయణరెడ్డి పేర్కొన్నారు. మొదట మనుషులుగా మనం గుర్తింపబడడం కాబట్టి మనిషిని మనిషిగా చూసే సమాజం రావాలని పేదోడికి అండగా నిలబడితే వారి గుండెల్లో నాయకులను పేదలు దాచుకుంటారని ఇది అనేక సందర్భాలను ఆనాటి స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మొదలు ఎన్టీఆర్ ఇలా అనేకమందిని గుండెల్లో పెట్టుకున్న సమాజాన్ని తెలంగాణలో చూసామని నారాయణరెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి తాను ఎప్పుడు పేదల సంక్షేమం పేదల అభివృద్ధి పేదల కష్టసుఖాలను పంచుకొని వారికి అండగా నిలబడడం నా అభిమతం అని తప్పకుండా పేదల పక్షాన నిలబడతానని నారాయణరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎండి మైపూస్ జిల్లా మత్స్యకార డైరెక్టర్ నర్సింలు మోల్ల గౌస్ ద్దీన్ పల్లె నాగేందర్, పీటర్ యాదప్ప ఎండి తాజుద్దీన్ తాడి అంజిలప్ప రాములు ఎల్లప్ప మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
