వినాయక చవితి సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడండి, అధికారులకు సూచించిన తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్,

ప్రభుత్వం, భద్రత

K, Yadaiah August 22,2025,

వినాయక చవితి సందర్భంగా ప్రజలకు ఎలాంటి తాండూరు పట్టణంలో గ్రామాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అధికారులకు సూచించారు…..

తాండూర్ :వినాయక చవితి సందర్భంగా గ్రామాలలో తాండూర్ పట్టణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం రోజు తాండూర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అధికారులకు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ సూచించారు. హిందు ఉత్సవ కమిటీ తో పాటు పోలీస్ మున్సిపల్, రోడ్లు భవనాల శాఖ పాల్గొనగా , ప్రజలకు  వినాయక ఉత్సవ నిమజ్జన కార్యక్రమాలకు కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాట్లతో పాటు ఇతర సమస్యలు కూడా తలెత్తకుండా చూసుకోవాలని దాని దానికోసం అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు.

కార్యక్రమంలో తాండూర్ డిఎస్పీ బాలకృష్ణారెడ్డి, సిఐలు ఎస్ఐలు, మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ ఇతర  సిబ్బందితోపాటు మున్సిపల్, రోడ్లు భవనాల శాఖ ఇతర సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *