ముఖ్యాంశాలు,
Kura Yadaiah| January 28,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :


Election|తాండూర్ మున్సిపల్ లో బిఆర్ఎస్ నేత పట్లోళ్ళ నర్సింలు నామినేషన్ దాఖలు చేశారు.బిఆర్ ఎస్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే బిఆర్ఎస్ 15, రోజుల్లో మున్సిపల్ పై బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని నర్సింలు ధీమా వ్యక్తం చేశారు….
Election|తాండూర్ : తాండూర్ మున్సిపల్ లో బుధవారం రోజు నామినేషన్ల పర్వం మొదలైంది ప్రతిపక్ష పార్టీ భారతీయ రాష్ట్ర సమితి నుండి ఆ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల నరసింహులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మీడియా అధికార ప్రతినిధి శ్రీశైల్ రెడ్డితో కలిసి నరసింహులు మాట్లాడుతూ తాండూర్ మున్సిపల్ లో ఉన్న 36 వార్డుల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించి సత్తా చాటుతుందని నర్సింలు ధీమా వ్యక్తం చేశారు. 15 రోజుల్లో మున్సిపల్ పై బిఆర్ఎస్ జండా ఎగరవేసి మాజీ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి కి బహుమతి గా ఇస్తామని నర్సింలు ఆశ భావం వ్యక్తం చేశారు. తాండూర్ అభివృద్ధి అంటే బిఆర్ఎస్ అని, బిఆర్ ఎస్ అంటే తాండూర్ అభివృద్ధికి నాంది పలికిందని అన్నారు.

రాబోయే 15, రోజుల్లో జెండా ఎగురవేస్తాం,
రాబోయే 15 రోజులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సమిష్టిగా కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని బిఆర్ఎస్ పార్టీని తాండూర్ మున్సిపల్ లో అధికారంలోకి తీసుకురాబోతున్నారని నర్సింలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్ చారి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నర్సింలు, బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
