ముఖ్యాంశాలు,విధ్య ,
Kura Yadaiah| January 23,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :


Education/ వసంత పంచమి సందర్భంగా రేగొండి ప్రాథమిక పాఠశాల యందు విద్యార్థులచే సరస్వతి మాత పూజ విద్యార్థులచే అక్షరాభ్యాస కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ డి అశోక్, ఘనంగా ప్రారంభించారు……
Education|పెద్దేముల్: పెద్దేముల్ మండలం రేగొండి గ్రామములో వసంత పంచమి సందర్భంగా రేగొండి ప్రాథమిక పాఠశాల యందు సరస్వతి మాత పూజా ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రోజు ప్రాథమిక పాఠశాలలో యందు ప్రధానోపాధ్యాయులు మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డి అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులచే సరస్వతి మాత పూజ అక్షరాభ్యాసం చేశారు.
గ్రామంలో విద్యాభివృద్ధికి సహకరిస్తా, సర్పంచ్ డి అశోక్,
గ్రామంలో విద్య అభివృద్ధికై తప్పకుండా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని సర్పంచ్ అశోక్ తెలిపారు. పాఠశాలకు కావలసిన మౌలిక వసతులతో కనీస అవసరాల కోసం ప్రభుత్వ సహాయ సహకారాలతో స్థానిక ఎమ్మెల్యే సహాయ సహకారాలతో పాఠశాల అభివృద్ధికి కూడా నిధులను వేచించి పాఠశాలను ఆదర్శవంతమైన పాఠశాల గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈనాటి సమకాలీన సమాజంలో విద్య లేనిది ఏది సాధించే పరిస్థితి లేదని దేశం సాంకేతిక రంగములో దూసుకుపోతున్న వేల పేద కుటుంబాలు అభివృద్ధి దిశగా నడవాలంటే విద్య ఒక్కటే సరియైన మార్గమని విద్య ఉంటే వ్యక్తి అభివృద్ధితో పాటు అయా కుటుంబాల అభివృద్ధి కూడా జరుగుతుందని పేర్కొన్నారు.

పాఠశాల దేవుని గుడితో సమానంగా చూసుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు యువకులు, విద్యాభివృద్ధి పట్ల సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. తమ తమ పిల్లలను అంగన్వాడిలో పాఠశాలలను చేర్పించి రేపటి తరానికి రూపురేఖలు దిద్దాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మనీలా ఏ ఏపీ సి చైర్మన్ సాయమ్మ గ్రామపచాయతీ వార్డు సభ్యులు మైనోదిన్ అంగన్వాడి టీచర్ ఫౌజీయా బేగం, పుల్లామొళ్ళ బంద్యయ్య, మాసముల్, వెంకటయ్య,
