తాండూర్ మున్సిపల్ కమిషనర్ యాదగిరిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన బిజెపి నేతలు,

రాజకీయం

K, Yadaiah August 23,2025

తాండూర్ మున్సిపల్ కమిషనర్ను యాదగిరిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించినట్లు తాండూర్ బిజెపి పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం తెలిపారు…..

తాండూర్:  తాండూర్ మాజీ మున్సిపల్ కమిషనర్ విక్రమ సింహారెడ్డి ఇటీవల బదిలీపై వెళ్లడంతో శనివారం రోజు నూతన కమిషనర్ యాదగిరి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తాండూర్ బిజెపి పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో తాండూరు పట్టణ బిజెపి నేతలు నూతన కమిషనర్ యాదగిరిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా నే త్వరలో రాబోతున్న వినాయక చవితి పండుగ సందర్భంగా తాండూర్ పట్టణంలో పరిశుభ్రత శానిటేషన్ రోడ్లపై గుంతల మరమ్మత్తులు వీధి దీపాల ఏర్పాటు తదితర సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ను కోరారు. మంచి నీటి సమస్య కూడా తలెత్తకుండా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు తాండూరు బిజెపి పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం తెలిపారు. కార్యక్రమంలో అంతారం లాలిత బాలప్ప బంటారంభద్రేశ్వర్ సురేష్ దోమ కృష్ణ రాజు చాకలి బిచ్చప్ప తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *