ప్రభుత్వం
Kura Yadaiah| November 1st, 2025
హిందు 9 న్యూస్ బ్యూరో :

గత వారం రోజుల క్రితం వీధి కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి చెందిన యజమాని కందనెల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఒగ్గు సత్తప్ప కు తోడుగా నిలబడ్డ ప్రభుత్వ చీఫ్ విప్ బిర్లా ఐలయ్య, 10,000,లు, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 25, వేల ఆర్థిక సాయం అందించి వారి కుటుంబానికి తోడుగా నిలబడ్డారు……
పెద్దేముల్: గత వారం రోజుల క్రింద పెద్దిమల్లు మండలం కందనెల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఒగ్గు సత్తప్ప చెందిన 55 గొర్రెలు వీధి కుక్కల దాడిలో గాయపడి మరణించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ బిర్లా ఐలయ్య తక్షణసాయంగా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించగా స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి25,000 రూపాయల ఆర్థిక సాయం అందించి బాధితునికి తోడుగా నిలబడ్డారు.

అనంతరం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి ఫోన్ ద్వారా జరిగిన విషయాన్ని చెప్పి ప్రభుత్వ పరంగా బాధితులను ఆదుకోవాలని కోరారు. కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో సంబంధిత కలెక్టర్ కూడా సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు కూడా జిల్లా కలెక్టర్ సూచించినట్లు వారు పేర్కొన్నారు. బాధ్యత కుటుంబానికి త్వరలో కురువ సంఘం తరపున 50 వేల ఆర్థిక సాయం అందించే విధంగా చూస్తామని ఐలయ్య మాట ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రతన్ సింగ్ మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి లొంక నర్సింలు, కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డ కింది అంజయ్య స్థానికులు అధికారులు తదితరులు ఉన్నారు.

