క్రైమ్
Kura Yadaiah |January 27,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :

ఇటివల వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రేగొండి సిమార్ లో హత్య గావించబడిన మహిళ ఒంటిపై ఉన్న ఆభరణాల కోసమే హత్య చేసినట్లు తాండూర్ DSP వెల్లడించారు…..
Crime news|తాండూర్ :– ఇటివల వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రేగొండి సిమార్ లో హత్య కు గురి అయిన మహిళ ఒంటిపై ఉన్న వెండి బంగారు ఆభరణాల కోసమే నిందితులు హత్య చేశారని తాండూర్ డిఎస్పి నర్సింగ్ యాదయ్య తెలిపారు. మంగళవారం రోజు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎస్ఐ శంకర్ లతో కలిసి నిందితులను మీడియా ముందు ప్రవేశ పెడుతూ ఈ సందర్భంగా వెల్లడించారు. వివరాల్లోకి వెళితే యాలాల మండలం పగిడిపల్లి గ్రామానికి చెందిన బందెమ్మ బ్రతుకుతెరువు నిమిత్తం తాండూర్ పట్టణంలో రోజువారి అడ్డ కూలీగా పనులు చేసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండింది. అయితే అదే అడ్డ కూలీగా పని చేస్తున్నటువంటి పెద్దేముల్ మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన మాల నర్సింలు, పక్క రాష్ట్రం కర్ణాటక బసవ కళ్యాణ్ చరణ్ నగర్ కు చెందిన కిషోర్ షిండే లు కలిసి 22వ తేదీన సదరు మహిళను కూలి పని కనీ చెప్పి నమ్మబలికి బంధేమ్మను పెద్దేముల్ మండలం రేగొండ సిమారులోని నిర్మానుషమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేసినట్లు వెల్లడించారు.

అనంతరం ఆమె వద్ద ఉన్న 22 మాసాల బంగారం 30 తులాల వెండి ఆభరణాలను తీసుకొని పారిపోయి శంకర్ పల్లి లోని ఓ బంగారు దుకాణంలో 49 వేల రూపాయలకు నగలను విక్రయించినట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఇట్టి కేసును చాలెంజిగా తీసుకున్న పోలీసులు పట్టణంలోని పలు కూడలిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా బంధేమ్మను తీసుకెళుతున్న ఇద్దరిని గుర్తించి విచారణ చేయగా నేరం చేసినట్లు ఒప్పుకోవడం జరిగిందని అలాగే చోరీ చేసిన నగలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని నర్సింలు కిషోర్ షిండేలను మంగళవారం రోజు రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పి వెల్లడించారు. 2022 సంవత్సరం ఓ మహిళను యాలాల మండలం రాస్నం అటవీ ప్రాంతంలో ఇదే తరహాలో హత్య చేసి నర్సింలు జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. నర్సింహులు పై రెండు మర్డర్ కేసులు నమోదు కావడంతో అతడి పై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని డిఎస్పి పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకోవడంలో చాకచక్కంగా త్వరితగతిన కేసును చేదించిన కానిస్టేబుల్ దస్తప్ప మున్నప్ప కృష్ణారెడ్డి అంజాద్ ప్రతాప్ సింగ్ లను తాండూర్ డిఎస్పి అభినందించి వారికి రివార్డులను అందిస్తూ మంచి పనితనాన్ని విధి నిర్వహణను డీఎస్పీ అభినందించారు.
