ముఖ్యాంశాలు
Kura Yadaiah| January 24,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :


MLA Manohar Reddy/ పెద్దేముల్ మండలంలోని గొట్ల పల్లి, బండపల్లి లో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి శనివారం రోజు ప్రారంభించారు…..
MLA Manohar Reddy|పెద్దేముల్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని గొట్లపల్లి ,బండపల్లి గ్రామపంచాయతీ పంచాయతీలలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాలను తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి శనివారం రోజు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు మహిళా సంఘాలకు ప్రత్యేక గుర్తింపునిస్తూ పెద్దపీట వేయడం జరిగిందని అన్నారు. డ్వాక్రా సంఘాలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సంఘాలను మరింత బలోపేతం చేయడంలో ప్రభుత్వం ముందుందని పేర్కొన్నారు.

నూతన సర్పంచులు గెలిచిన తర్వాత అనేక గ్రామాలకు నిధులు కేటాయించాం,
నూతన సర్పంచులు గెలిచిన నెలలోపే నియోజకవర్గంలో అనేక గ్రామాలకు నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. రేషన్ కార్డులు ఇవ్వడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి అందజేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన చీరల కంటే ప్రస్తుత ప్రభుత్వం నాణ్యమైన ఇందిరమ్మ చీరలు ఇవ్వడంలో ప్రభుత్వం తన ప్రత్యేకతను చాటుకుందని తెలిపారు.

రాబోయే రోజుల్లో మహిళల అభివృద్ధికి మరింత కృషి,
రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా మహిళలను ఇంకాస్త అభివృద్ధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తుందని అన్నారు.

కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య గొట్లపల్లి సర్పంచ్ సలాం ఉపసర్పంచ్ చంద్రయ్య కాంగ్రెస్ నాయకులు లొంక నర్సింలు, రియాజ్, డివై నర్సింలు, కోయిర్ రవి, మైపాల్ రెడ్డి, గ్రామ మహిళా సమైక్య అధ్యక్షురాలు శారద బండపల్లి సర్పంచ్ ప్రమీల ఉపసర్పంచ్ రవీందర్ ,వార్డు సభ్యులు పలు గ్రామాల సర్పంచులు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
