యూనిటీ చారి ట్రబుల్ ట్రస్ట్ సేవలు అమోఘం, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి,

author
0 minutes, 6 seconds Read

ముఖ్యాంశాలు, క్రీడలు,

Kura Yadaiah January 

హిందు 9 న్యూస్ బ్యూరో :-

MLA Manohar Reddy|యూనిటీ చారి ట్రబుల్ ట్రస్ట్  తరపున చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం అమోఘమని 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంబాపూర్ బ్లూ స్కై ఫామ్ హౌస్ లో యూనిటీ చారి ట్రబుల్ ట్రస్ట్ ధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నారు……

MLA Manohar Reddy|పెద్దేముల్: యూనిటీ చారి ట్రబుల్ ట్రస్టు ఈమధ్య చేస్తున్న సేవల అభినందనీయమని తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా 77వ, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రోజు పెద్దేముల్ మండలం మంబాపూర్ పంచాయతీ పరిధిలో ఉన్న బ్లూ స్కై ఫామ్ హౌస్ లో యూనిటీ చారి ట్రబుల్ ట్రస్టు యాజమాన్యం సయ్యద్ మన్నన్, సయ్యద్ సాబేర్, ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విద్యార్థుల ఆటవస్తుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన MLA Manohar Reddy,కొండాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు క్రికెట్ కిట్లు వాలీబాల్ ఇతర ఆటవస్తులను  అందజేస్తూ ఈ సందర్భంగా అన్నారు. యూనిటీ చారి ట్రబుల్ ట్రస్ట్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచన  సయ్యద్ మన్నన్ సయ్యద్ సాబేర్ లకు  స్వాగతించాల్సిన అంశమని ఇది గొప్ప అభినందనీయమైన కార్యక్రమని అన్నారు.  పల్లె ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు  తమ వంతు సహాయం అందించడం గొప్ప పరిణామమని అన్నారు.

భవిష్యత్తులో సేవా కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుంది  ఎమ్మెల్యే,

ఇలాంటి సేవా  అందరూ అలవర్చుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా యూనిటీ చారి ట్రబుల్ ట్రస్ట్ తరఫున ఈ సేవా కార్యక్రమాలు చేపట్టిన తప్పకుండా తమ మద్దతు ఉంటుందని mla Manohar Reddy అన్నారు.చుట్టుపక్కల పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్య అభివృద్ధి కోసం గ్రామీణ క్రీడల అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

బ్లూ స్కై ఫామ్ హౌస్ లో యూనిటీ చారి ట్రబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆట వస్తువుల పంపిణీ దృశ్యం

పేద విద్యార్థుల విద్యాభివృద్ధికై తప్పకుండా తోడుపాటునందిస్తాం, సయ్యద్ మన్నన్, సయ్యద్ సాబేర్,

యూనిటీ చారి ట్రబుల్ ట్రస్టు యాజమాన్యం సయ్యద్ మన్నన్, సయ్యద్ సాబేర్ లు మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలో ఒకటైన కొండాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు యూనిటీ చారి ట్రబుల్ ట్రస్ట్ తరఫున తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా క్రీడా వస్తువులను అందించడం మాకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగించిందని అన్నారు. భవిష్యత్తులో ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మెరుగైన విద్య కోసం తమ వంతు సహాయ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ విద్యార్థుల కోసం రాబోయే రోజుల్లో క్రీడలను వారిలో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించే విధంగా క్రీడా సామాగ్రి కానీ విద్యార్థుల చదువులకు కావలసిన బుక్కులు పెన్సిల్ లాంటివి అందించే విధంగా చూస్తామని తెలిపారు.  పేదల పిల్లలు మంచి విద్యను అభ్యసించి అభివృద్ధి చెందాలని వారి కుటుంబాలను అభివృద్ధి దిశలో నడిపించుకోవాలని వారు ఆకాంక్షించారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇక మీదట కూడా తమ వంతు సహాయంగా అందించేందుకు యూనిటీ చారి ట్రబుల్ ట్రస్టు ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ధారాసింగ్, కోటపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాయిని నారాయణరెడ్డి, యువ నాయకులు మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మంబాపూర్ మాజీ సర్పంచ్ శ్రావణ్ కుమార్, కొండాపూర్ సర్పంచ్, బిబి హనీష్, ఉప సర్పంచ్ పద్మ, కొండాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్, రేగొండి సర్పంచ్ డి అశోక్, యండి, పాషా,
కోనేరు మానెయ్య పి బందేయ్య, మంబాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైపూస్, జె వెంకటయ్య, డి రత్నం డి వెంకటయ్య, చైతన్య నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, బిచ్చప్ప శ్రీనివాస్, రాములు, కొండాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటయ్య, కిషన్, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *