ముఖ్యాంశాలు, క్రైం
Kura Yadaiah January 24,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :
Crime news| రేగొండి సీమార్ లో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో మహిళ హత్యకు గురైన సంఘటన స్థానికులను కలవడానికి గురి చేసింది…….
Crime news|పెద్దేముల్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రేగొండి గ్రామ సీమార్గులో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో ఓ మహిళ హత్యకు గురైన సంఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.ప్రాథమిక సమాచారం మేరకు తాండూరులో అడ్డ కూలిగా పనిచేసుకుంటున్న మహిళను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు రేగొండి ప్రాంతంలోని పొదల వద్దకు తీసుకువచ్చి గొంతు కోసి హత్య చేసినట్లు విశ్వాసనీయ సమాచారం ద్వారా తెలియ వచ్చింది.
వివరాల్లోకి వెళితే,
వివరాల్లోకి వెళ్ళితే మహిళా వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా ఈ యాలాల్ మండల్ పగిడిపల్లి ప్రాంతానికి చెందిన బందెమ్మగా గుర్తించినట్లు తెలిసింది. అసలు మహిళను ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది?దేనికోసం హత్య చేశారు ? హత్య చేసిన నిందితులు ఎవరు? అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
