శాంతిభద్రతల పట్ల రాజీ పడొద్దు-తీవ్రమైన నేరాలలో దర్యాప్తును వేగవంతం చేయండి – జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా,

author
0 minutes, 4 seconds Read

ముఖ్యాంశాలు, 

Kura Yadaiah|January 24,2026,

హిందు 9 న్యూస్ బ్యూరో :

ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా వికారాబాద్ జిల్లా

Sp Vikarabad | జిల్లాలో శాంతిభద్రతల పట్ల రాజీ పడొద్దని తీవ్రమైన నేరాలు హత్యలు దొంగతనాలు లాంటి నేరాలలో దర్యాప్తును వేగవంతం చేయాలని వికారాబాద్ జిల్లాను నేర రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా వెల్లడించారు…..

SP Vikarabad| వికారాబాద్ జిల్లా: శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజు పడొద్దని తీవ్రమైన నేరాలు హత్యలు దొంగతనాల కేసులలో దర్యాప్తును వేగవంతం చేయాలని శనివారం రోజు వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీస్ అధికారుల సమీక్ష సమావేశంలో ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లాలోని శాంతి భద్రత పరిస్థితులపై పోలీసు అధికారులతో శనివారం రోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తూ పోలీస్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించడమే కాకుండా బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పక్క ఆధారాలతో కోర్టుల్లో చార్ సీట్లు దాఖలు చేయాలని ఆమె స్పష్టం చేశారు.

కన్వెన్షన్ రేట్ శాతాన్ని పెంచడం వల్లనే నేరస్తుల్లో భయం ఉంటుంది,

కన్వెన్షన్ రేటు శాతాన్ని పెంచడం ద్వారానే నేరస్తుల్లో భయం కలుగుతుందని అప్పుడే నేరాలు కూడా తగ్గుముఖం పడతాయని ఆమె అభిప్రాయపడ్డారు. పోలీస్ స్టేషన్కు సమస్యల పట్ల వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించి తక్షణమే స్పందించాలని అప్పుడే ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై సామాన్యమైన ప్రజలకు కూడా నమ్మకం పెరుగుతుందని ఆకాంక్షించారు. మహిళలు చిన్నారులు మరియు వృద్ధుల భద్రత విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

రాత్రిపూట పెట్రోలింగును ముమ్మరం చేయండి,

రాత్రిపూట సమయాలలో పెట్రోలింగ్ ను ముమ్మరం చేయాలని ప్రధాన కోడళ్ళలో సిసి టీవీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించి అమర్చే విధంగా చూడాలని సూచించారు. నేర నివారణలు సీసీ కెమెరాలు మూడవ నేత్రముల పనిచేస్తాయని వాటి నిర్వాహనను నిరంతరం పర్యవేక్షణ చేయాలని తెలిపారు. పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్ పట్ల ప్రజలకు అవగాహన సదస్సులు, కార్యక్రమాలు అపరిచిత లింకులు అపరిచిత కాల్స్ పట్ల ప్రజలను అప్రమత్తం చేసి చైతన్యవంతులను చేయాలని ఆదేశించారు.

గంజాయి మాలక ద్రవ్యాలు అక్రమ మద్యమంపై ఉక్కు పాదం మోపండి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించండి,

గంజాయి మాదకద్రవ్యాలు మత్తు పదార్థాల విక్రయదారులపై ఉక్కు పాదం మోపాలని జిల్లాలో అక్రమ మద్యం రవాణాను పూర్తిగా అరికట్టాలని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ ఆదేశించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పోలీస్ అధికారులు ముందస్తుగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన ప్రణాళికలు భద్రతను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

జిల్లాను నేర రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలి,

రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్స్ గుర్తించి అక్కడ హెచ్చరిక బోర్డులు రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసేలా రవాణా శాఖతో సమన్వయం చేసుకొని కార్యక్రమాలను పూర్తి చేయాలని తెలిపారు. విధి నిర్వహణలో ప్రతి అధికారి క్రమశిక్షణతో బాధ్యతగా పనిచేస్తూ జిల్లాను నేర రహిత  జిల్లాగా మార్చడానికి కృషి చేయాలని కోరారు.

కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి రాములు నాయక్, టిటిసి డిఎస్పి శ్రీనివాసులు డిసిఆర్ బి, డి ఎస్ పి జానయ్య, తాండూర్ డిఎస్పి ఎన్ యాదయ్య, వికారాబాద్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి, పరిగి డిఎస్పి శ్రీనివాస్, ఏఆర్డిఎస్పి వీరేష్, జిల్లాలోని ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ను ఎస్సైలు ఆర్ఐలు ఆర్ఎస్ఐలు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *