నిరసన
Kura Yadaiah|December 20|2025
హిందు 9 న్యూస్ బ్యూరో :-

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు కు, మోహినాబాద్ అజీజ్ నగర్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆదివారం రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఈ నిరసన కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్ పిలుపునిచ్చారు….
చేవెళ్ల :- కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పేరు మార్పులు చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి అజిత్ నగర్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆదివారం రోజు ఏఐసీసీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు. చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పామేన భీమ్ భరత్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 10:30 నిమిషములకు అజిత్ నగర్ మాత్మ గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడాని వ్యతిరేకిస్తూ చేపడుతున్న నిరసన కార్యక్రమానికి టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ చెల్లా వంశీచంద్ రెడ్డి జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి మాజీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి నియోజకవర్గం నందు పార్టీ వివిధ విభాగాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు కార్యకర్తలు సీనియర్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొనాలని భీమ్ భరత్ పిలుపునిచ్చారు.
