రాజకీయం
Kura Yadaiah|December 2 0,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :-

చలనచిత్రం పతాకంపై ఒక వెలుగు వెలిగి మంచి సామాజిక నేపథ్యం కుటుంబ కథా చిత్రాలతో ప్రజల ఆదరణ పొందిన చలనచిత్ర సీనియర్ నటి శ్రీమతి ఆమని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రామచంద్ర రావు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీల చేరారు…..
హైదరాబాద్ :- చలనచిత్ర సీనియర్ నటి శ్రీమతి ఆమని భారతీయ జనతా పార్టీలో తెలంగాణ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఆమని అనేక సామాజిక స్పృహ కలిగి సినిమాలు చేసి ప్రజలను ఆకట్టుకున్నారు. కుటుంబ కథా చిత్రాలు ఆమెకు మంచి పేరును కూడా తెచ్చిపెట్టాయి. రాజకీయాల ద్వారా ప్రజలకు దేశానికి సేవ చేయాలని దృక్పధంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి నిబద్ధత చూసి భారతీయ జనతా పార్టీలో చేరినట్లు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. ప్రజాదరణ మంచి అనుభవం ఉన్న శ్రీమతి యామని వికసిప్ భారత్ కోసం కృషి చేస్తుందని రామ్ చందర్రావు ఆకాంక్షించారు.
