నిరసన
Kura Yadaiah| November 21,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :-

బీసీలకు అన్యాయం చేయొద్దు పార్టీ పరంగా కాదు చట్టబద్ధంగా ఇవ్వండి రిజర్వేషన్లు కల్పించాలని శుక్రవారం రోజు తాండూర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కందుకూరి రాజ్ కుమార్ అన్నారు….
తాండూర్:- బీసీలకు పార్టీ పరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ కాకుండా చట్టబద్ధత కల్పించి సర్పంచి ఎన్నికలు నిర్వహించాలని చట్టబద్ధంగా బీసీలకు అవకాశం ఇవ్వాలని జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం రోజు తాండూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శన కార్యక్రమంలో ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్న పరిస్థితులు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవడం అన్యాయం అని పేర్కొన్నారు. పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం అలాగే కేంద్రం నుండి నిధులు పొందడానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పడం బీసీలను మభ్య పెట్టడమేనని రాజకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు తాండూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో సయ్యద్ సుకుర్ గడ్డం వెంకటేష్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి తాండూర్ మహిళా అధ్యక్షురాలు అనిత ఉపాధ్యక్షురాలు మంజుల నరసమ్మ జగదీశ్వరి పరమేశ్వర రజక సంఘం అధ్యక్ష కార్యదర్శులు రమేష్ రవికుమార్ బసప్ప గౌడ హరి ప్రసాద్ గౌడ్ రవి గౌడ్ ముదిరాజ్ సంఘం నాయకులు రాము దుబాయ్ వెంకట్ హరిప్రసాద్ శ్రీనివాస్ భోజనం నాయకులు అరుణ్ రాజ్ జోసెఫ్ అంతరం ప్రవీణ్ సోషల్ మీడియా ఇన్చార్జి బసవరాజ్ బీసీ సంఘం మండల అధ్యక్షులు నరేందర్ బసంత్ కుమార్ యాసర్ పరమేశ్ అశోక్ శ్రీనివాస్ పకీరప్ప అంబాదాస్ రాజు జగదీష్ కందినేని జగన్ కందనేని జగన్ జగదీశ్వరయ్య శ్రీనివాస్ చిన్న కిరణ్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.
