భద్రత ,
K, Yadaiah. August 25, 2025,


వినాయక చవితి ఉత్సవాలలో శాంతిభద్రతలకు ఎలాంటి విగాథ కలిగించ శాంతి భదతల పర్యవేక్షణకు ప్రత్యేక పోలీస్ అధికారులను ఏర్పాటు చేస్తున్నట్లు తాండూర్ రూరల్ సీఐ నాగేష్ అన్నారు.
పెద్దేముల్: వినాయక చవితి ఉత్సవాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీస్ అధికారులను ఏర్పాటు చేస్తున్నట్లు తాండూర్ రూరల్ సీఐ నాగేష్ తెలిపారు. వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండుగల సందర్భంగా సోమవారం రోజు పెద్దేముల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో అన్ని మతాల, వినాయక ఉత్సవ కమిటీలు, రాజకీయ పార్టీల నాయకులతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తాండూర్ రూరల్ సీఐ నాగేష్ పెద్దేముల్ మండల తాసిల్దార్ వెంకటేష్ ప్రసాద్ స్థానిక మండల అభివృద్ధి అధికారి రతన్ సింగ్ వివిధ పార్టీల రాజకీయ నాయకులు ఉత్సవ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించే ఉత్సవ కమిటీ సభ్యులు శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని సిఐ నాగేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు రాజకీయ నాయకులకు ఇతర మత పెద్దలకు సూచించారు.
వివరాలు ఆన్లైన్ పోర్టల్ లో నమోదు,
అలాగే వినాయక ఉత్సవ కమిటీ సభ్యుల వివరాలను విగ్రహాల వివరాలను ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేసుకొని విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. మండపాలకు విద్యుత్ కాంతుల కోసం జాగ్రత్తగా విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. వినాయకుల నిమజ్జనం రోజు డిజె సౌండ్లకు అనుమతి ఇవ్వడం లేదని ఎవరు వచ్చిన అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని సీఐ స్పష్టం చేశారు. ప్రతి వినాయకుని మండపం వద్ద రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి మైక్ సెట్ లను కూడా నిర్వహించొద్దని 10 తర్వాత పూర్తిగా బంద్ చేయాలని నిర్వాహకులను ఉద్దేశిస్తూ తెలిపారు. మిలాద్ ఉన్ నబి పండుగను కూడా శాంతియుతంగా జరుపుకునే విధంగా చూడాలని శాంతిభద్రతలను కాపాడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ఉత్సవ కమిటీ సభ్యులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
