రాజకీయం,
K, Yadaiah August 25,2025,

పెద్దెముల్ మండలంలోని రోడ్లను పూర్తిస్థాయిలో బాగు చేసి ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించాలని అలాగే పెద్దెముల్ మండల్ లో ఎర్రమట్టి శుద్ధ కంకర అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని పెద్దేముల్ మండల తాసిల్దార్ వెంకటేష్ ప్రసాద్ కు బిజెపి మండల అధ్యక్షులు వీరేశం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.
పెద్దేముల్: పెద్దేముల్ మండలంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లే రోడ్లన్నీ గుంతల మయంగా మారాయని వాటి వల్ల రైతులకు గర్భిణీలకు విద్యార్థులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుంతల రోడ్డులతో ప్రజలు ఎక్కడికైనా వెళ్లి రావాలంటేనే భయభయంగా ఉందని అలాగే రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు దుమ్ము కాలుష్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పు శ్వాస కోశ కండ్లవాపు తదితర రోగాలు వచ్చే ప్రమాదం కూడా ఉందని పరితగతిన ప్రభుత్వం రోడ్లను పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేయించి ప్రజలను ఆదుకోవాలని సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించే విధంగా చూడాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు, రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజు బిజెపి అధ్యక్షులు వీరేశం ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో వెంకటేశ్ ప్రసాద్ కు రోడ్లు, ఎర్రమట్టి ,శుద్ధ ,కంకర అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని కోటపల్లి ప్రాజెక్టు కాలువలకు పూడికలు చేపట్టాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇయు రమేష్ కుమార్ మాట్లాడుతూ పెద్దెముల్ మండలంలో ఉన్న రోడ్లు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉందని దానికి తోడు వర్షాకాలం రావడంతో రోడ్లన్నీ గుంతల మయం కావడంతో మహిళలకు గర్భిణీలకు చదువుకునే విద్యార్థులకు రైతులకు ప్రయాణించాలంటే భయంగా ఉందని రోడ్లకు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టి ప్రజలను దుమ్ము కాలుష్యం నుండి కాపాడాలని కోరారు.
అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి!
మండలంలో ఎర్రమట్టి ,శుద్ధ ,కంకర, లాంటి సహజ సంపదలు ఎన్నో ఉన్న వాటి ద్వారా మండల అభివృద్ధికి ఒరిగింది ఏమీ లేదని ఎర్రమట్టి ,సుద్ధ ,కంకర అక్రమ మైనింగ్ గురవుతున్నదని రమేష్ అన్నారు. తక్షణమే అక్రమ మైనింగ్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోటపల్లి ప్రాజెక్టు అనాతి కాలము ఇక్కడి రైతులకు జీవన ఆధారంగా ఉండిందని అయితే ప్రస్తుతం కాలువలు పూర్తిగా కూడుకపోవడం వల్ల రైతులకు నీళ్లు రాక పంటలు పండక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పూర్వకాలంలో కోటపల్లి ప్రాజెక్టు కాలువలు నాణ్యతతో కూడి సక్రమంగా ఉండడం వల్ల ఇక్కడి రైతాంగం ఇక్కడి పల్లెలు అభివృద్ధికి నోచుకున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు కాలువలు కబ్జాలకు గురై కాలువలో పూర్తిగా ముండ్ల పొదలు చెట్లు చెదారంతో నిండిపోవడంతో నీళ్లు సక్రమంగా రాకపోవడంతో నేడు రైతులు పంటలు పండించే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోటపల్లి ప్రాజెక్టు కాలువలపై సర్వేలు నిర్వహించిన ఇప్పటివరకు కాలువల పూడిక తీత తీయకపోవడం రైతులకు నష్టం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కోటపల్లి ప్రాజెక్టు కాలువల పూడికతీత చేపట్టి ప్రాజెక్టు నీళ్లపై ఆధారపడి వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులకు వారి ఆర్థిక అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరుగారెంటీలు సక్రమంగా ఎక్కడ కూడా అమలవుతున్నట్టుగా కనిపించడం లేదని ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలు సక్రమంగా అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సందీప్, జిల్లా కార్యదర్శి భద్రేశ్వర్, శివరాజ్ యాదయ్య గౌడ్ హరీష్ గౌడ్ నరసింహులు రాజు తదితరులు పాల్గొన్నారు.
