లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డ పెద్దేముల్ ఆర్ ఐ రిచర్డ్ సైమన్,

నేర వార్తలు,

హిందు 9 న్యూస్ ;19|3|2026,

______పెద్దేముల్ తాసిల్దార్ కార్యాలయానికి అవినీతి మరక రెండోసారి.!

భూమి మోటేషన్ విషయంలో పదిహేను వేల రూపాయల లంచం తీసుకుంటూ హైదరాబాదులోని గుడిమల్కాపూర్ ప్రాంతంలో పెద్దెముల్ మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రిచర్డ్ సైమన్ ఏసిబికి పట్టుబడ్డాడు…….

తెలంగాణ బ్యూరో : పెద్దేముల్  మండలం తాసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రిచర్డ్ సైమన్ ఓ భూమి మోటేషన్ చేయడానికి సదరు వ్యక్తుల నుండి హైదరాబాద్ కేంద్రంగా గుడిమల్కాపూర్ ప్రాంతంలోని  శ్రీ గోల్డెన్ ప్యాలెస్ రెస్టారెంట్ 15000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.

వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం తాసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రిచర్డ్ సైమన్ పెద్దేముల్ మండల్ ఇందూర్ కు చెందిన సర్వే  104/ఎ, లో 2.7 ఎకరాల భూమి స్వాధీనంలో ఉందని పంచానామా చేసి  పెద్దేముల్ మండలం తాసిల్దార్ కు నివేదిక సమర్పించే విషయంలో లంచం డిమాండ్ చేసినట్టు అధికారులు తెలిపారు.

ఈ విషయంలోనే 15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు  అధిరులు వెల్లడించారు. తన నుండి 15,000 లంచం సొమ్మును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

అక్రమంగా ప్రయోజనం పొందడానికి తన విధిని సక్రమంగా మరియు నిజాయితీ లేకుండా నిర్వర్తించాడని అందువల్ల తనను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కోసం నాంపల్లిలోని ఎస్పీఈ & ఏసిబి కేసుల మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరచడం జరుగుతుందని ACB అధికారులు స్పష్టం చేశారు.

ఈ కేసులో దర్యాప్తులో ఉందని, భద్రత కారణాల దృష్ట్యా ఫిర్యాదు దారుని వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

– రేషన్ కార్డు ఆన్లైన్ ప్రక్రియ, కులం ఆదాయం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో కూడా అధికారుల నిర్లక్ష్యమే!

అయితే పెద్దెముల్ తాసిల్దార్ కార్యాలయం పై పలుమార్లు అవినీతి ఆరోపణలు వచ్చాయని ప్రస్తుత నేపథ్యంలో జరిగిన ఘటనను ఉదారిస్తూ మండల  లో ప్రజలు చర్చించుకుంటున్నారు.

చిన్న చిన్న వాటికి కూడా అధికారులు సామాన్య జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్యాలయాల చుట్టూ తిరుగా లేక విసుగెత్తిపోతున్నామని ప్రజలు వాపోతున్నారు.

అవినీతి అధికారులకు ఇలాంటి శాస్తి జరగాల్సిందేనని జనం చెప్తున్నారు. అక్రమ ఇసుక అక్రమ మైనింగ్ తదితర అంశాలపై స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తుంటే ప్రస్తుతం జరిగిన దానిని బట్టి చూస్తే  ప్రజల పట్ల అధికారులకు ఉన్న విశ్వాసనీయత సేవాగుణం గురించి స్పష్టంగా   తెలిసిపోతున్నదని పలువురు విమర్శిస్తున్నారు.

సమయానికి అధికారులు కార్యాలయానికి రాకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పనులు కూడా మండల్లో సరిగా జరగడంలేదని జనం మండిపడుతున్నారు. రేషన్ కార్డులు కులం ఆదాయం సర్టిఫికెట్ లో కూడా అధికారులు జాప్యం చేస్తూ ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పుకోవడానికే సరిపోతుందని పలు లబ్ధిదారులు ఆరోపించారు.

_ రేషన్ కార్డులలో అధికారుల జాప్యం!

ప్రభుత్వం ఒకపక్క అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందించాలని చెప్పుకొస్తున్న ఇక్కడ మాత్రం సరిగ్గా రేషన్ కార్డుల ఆన్లైన్ కార్యక్రమం జరగడంలేదని రేషన్ కార్డు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు.

కిందిస్థాయి సిబ్బంది ఒకరిద్దరైతే వారికి నచ్చిన వారికి రేషన్ కార్డులు ఆన్లైన్ చేసి అప్రూవల్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారని దళిత పేద బడుగు బలహీనవర్గాల  ప్రజలకు సమన్యాయం అందించడం లేదని లబ్ధిదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్డీవో కానీ జిల్లా కలెక్టర్ గాని ఇలాంటి కార్యాలయాల మీద దృష్టి పెట్టి ప్రజలకు, ప్రభుత్వం చెప్పుకుంటున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని సక్రమంగా జరిగేలా చూడాల్సిన అవసరం ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

_రెవెన్యూ శాఖ ప్రజలకు అతి ముఖ్యమైనది,

ప్రజలకు అతి ముఖ్యమైన రెవెన్యూ శాఖ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాల్సిన అవసరం ఉందని ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా జిల్లాలోనే ఇలాంటి ఘటనలు జరగడం మంచిది కాదని ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా  సౌలభ్యం కోసం అధికారులు దృష్టి సారించి సేవలందిస్తే అధికారులపై ప్రభుత్వంపై విశ్వసనీయత పెరిగి ప్రజల్లో గుర్తింపును తెచ్చుకుంటాయని వాపుతున్నారు.

లేకపోతే అవినీతి అధికారుల నిర్లక్ష్యం మూలాన  ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే కార్యాలయాలను తనిఖీ చేస్తే ?

స్థానిక ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులతో కలిసి కార్యాలయాలను అప్పుడప్పుడు తనిఖీ చేస్తే బాగుంటుందని తనిఖీ చేసే సందర్భాలలో ప్రజలకు అందుతున్న సేవలపై కూడా ఆరా తీస్తే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని సామాజిక సంఘాలు అంటున్నాయి.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *