ఆర్ కృష్ణయ్య సత్యాగ్రహ దీక్షకు మద్దతు తెలిపిన, జాతీయ బీసీ సంఘం నేత కందుకూరి రాజ్ కుమార్,

సామాజిక

K, Yadaiah.  August 25,2025

 

బీసీ రిజర్వేషన్లపై ఆర్ కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు మద్దతు తెలిపినట్లు రాజ్ కుమార్ తెలిపారు….

హైదరాబాద్ : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సోమవారం రోజు హైదరాబాద్ జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో జరుగుతున్న సత్యాగ్రహ దీక్ష తాండూర్ జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు కందకూర్ రాజ్ కుమార్ సంఘీభావం దీక్షలో పాల్గొన్నారు .

ఈ సందర్భంగా రాజ్ మార్ మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ బిల్లు అమలు సామాజిక న్యాయానికి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాయని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 246 కింద తన అధికారాలను వినియోగించుకొని అసెంబ్లీలో చట్టం బిల్లు పాసు చేయాలని రాష్ట్రంలో 14 బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీ బిల్లు పై 42 శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్లను చట్టం చేసి ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆర్ కృష్ణయ్య సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా బిట్టు వెంకటేష్ పవన్ కుమార్ సత్తార్ శ్రీశైలం వివేక్ మల్లేశం గోపాలకృష్ణ యాదవ్ రాఘవేంద్ర చారి వెన్నచెడు రాములు, మహబూబ్మియా గౌరీ తిప్పన్న సంపత్ కుమార్ విగ్నేష్ జాంగిర్ భాష చాకలి గుండప్ప చంద్రవంచ సురేష్ కాష్ అప్ప తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *