ముఖ్యాంశాలు,
హిందు 9 న్యూస్ బ్యూరో :

_____రాబోయే రోజుల్లో వికలాంగులకు మరిన్ని సంక్షేమ పథకాలతో పాటు, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం, చైర్మన్ ముత్తినేని వీరయ్య,
షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో వికలాంగులకు 2000 స్కూటీలను పంపిణీ చేశామని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ మృతినేని వీరయ్య తెలిపారు…
షాద్నగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల ఆత్మబంధువుగా వారికి సంక్షేమ పథకాలను తీసుకొస్తూ అండగా నిలబడ్డారని షాద్నగర్ వికలాంగుల స్కూటీల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ప్రసంగించారు.
షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో వీరయ్య పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలాంగులకు రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా స్కూటీలు ఇతర సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ వికలాంగుల గుండెల్లో ఆత్మబంధువుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిచారని వీరయ్య అన్నారు.
రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అర్హులైన వికలాంగుల అందరికీ కూడా స్కూటీలు ఇతర సహాయ పరికరాలతో పాటు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా దృష్టి పెడతామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు వికలాంగుల సంఘాల నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
