ముఖ్యాంశాలు
Kura yadaiah| January 26,2026,
హిందు 9న్యూస్ బ్యూరో :


Republic Day|పెద్దేముల్ : భారత 77వ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దేముల్ మండలం రేగొండి. ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేష్ జెండా ఆవిష్కరణ చేసి గ్రామ ప్రజలకు రాష్ట్ర దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ముందుగా గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి, అనంతరం అంబేద్కర్ విగ్రహం, అలాగే అంగన్వాడి సెంటర్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేసి గణతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా గ్రామస్తులు నిర్వహించుకున్నారు.

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేష్ మాట్లాడుతూ.గణతంత్ర దినోత్సవం అంటే భారతదేశంలో స్వాతంత్ర అనంతరం భారత రాజ్యాంగాన్ని అమలుపరచుకున్న దినోత్సవం అని 1950 జనవరి 26న మన దేశానికి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిర్మాతగా భారత రాజ్యాంగాన్ని రచించారని రాజ్యాంగం అమలు ద్వారానే దేశ రాష్ట్ర గ్రామ పరిపాలన విభాగాలను నిర్మించుకున్నామని రాజ్యాంగం ప్రకారమే ఈరోజు దేశంలో రాష్ట్రంలో గ్రామ పరిపాలనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రపంచ దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని అతి గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగం అని కొనియాడారు.

అంబెడ్కర్ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ దృశ్యం
అయితే గ్రామాలలో విద్యా అభివృద్ధి జరిగితేనే ప్రతి కుటుంబం అభివృద్ధిలోకి వస్తుందని దాని ద్వారానే గ్రామాల అభివృద్ధి మండలాలు జిల్లాలు రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుందని ఆ దిశగా గ్రామంలో ఉన్న యువకులు గ్రామ పెద్దలు సర్పంచులు గ్రామ విద్యాభివృద్ధికి సహకరించాలని ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం వచ్చే విధంగా రాబోయే రోజుల్లో యువకులు గ్రామంలో ప్రయత్నం చేయాలని ఆకాంక్షించారు. అలాగే గ్రామంలోని యువకులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపన్యాసాలు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులచే సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు గ్రామస్తులను యువకులను పలువురిని ఆకట్టుకున్నాయి.గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించిన అంగన్వాడి పాఠశాల విద్యార్థులకు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ సభ్యులచే అవార్డుల ప్రధానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్ ఫౌజీయా బేగం, ఉప సర్పంచ్ మనీలా, డ్వాక్రా సంఘం గ్రామ కమిటీ అధ్యక్షులు,సాయమ్మ, వార్డు సభ్యులు నాగేష్,లింగేష్, మైనోద్దిన్. సునీత, పి,బంద్యయ్య, మానేయ్య, మైహిముద్, అరుణ్ కుమార్, సంజయ్య ఈడ్గి మల్లేశం, వెంకటయ్య బీమయ్య, చంద్రప్ప, పంచాయతీ వర్కర్ కూర మల్లేశం, టి రాములు,యువకులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.
