BC reservation| 18 తారీఖున బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకై రాజ్యాంగంలోని 9వ, షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించుటకై రేపు తలపెట్టిన బందుకు బహుజన రైతు కూలి సంఘం సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నట్లు ఆ సంఘం నేత నాగన్న తెలిపారు,
kura yadaiah |October 17,2025,
హిందు 9న్యూస్ డెస్క్ :
BC reservation | బిసి 42% రిజర్వేషన్ జీవో నెంబర్ 9 తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవన్ కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం బిల్లును రాజ్యాంగంలోని 9 షెడ్యూల్లో చేర్చాలని అప్పుడే దానికి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా హక్కు ఉంటుందని అయితే దాంట్లో భాగంగానే Telangana లో 18 తారీకురోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇచ్చిన బీసీ బంద్ కు బహుజన రైతు కూలీ సంఘం తమ సంపూర్ణ మద్దతు నిస్తుందని ఆ సంఘం నేత నాగన్న తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం వల్ల స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో పాటు విద్య ఉద్యోగ రంగాలలో కూడా బీసీ కులాలకు ప్రాధాన్యత లభిస్తుందని, ఆ దిశగా బీసీ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందని వారు కోరారు. బీసీ సమాజంతో పాటు సామాజిక న్యాయం మేము ఎంత మందిమో మాకు అంత వాటా అనే నినాదం మాన్యశ్రీ కన్సీరామ్ కలలుగన్న నినాదం అని ఆ నినాదం పూర్తిస్థాయిలో అమలు కావాలంటే రాజ్యాంగబద్ధ హక్కు కోసం పోరాటం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. కాబట్టి రేపు( 18,) బీసీ జేఏసీ నేతలు జరపతలపెట్టిన బీసీ బంద్ ఒక చరిత్ర కలిగిన అంశమేనని గతంలో బీసీ సమాజం హక్కుల కోసం ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా పిలుపునిచ్చిన సందర్భాలు లేవని బీసీలు ఇప్పటికైనా మేల్కొని పార్టీలకు అతీతంగా రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన హక్కు కోసం రేపు తలపెట్టిన బీసీ బందులో భాగస్వాములు కావాలని దానికి బహుజన కులాలు మొత్తం సహకరించాలని అప్పుడే సామాజిక న్యాయం సిద్ధిస్తుందని కోరారు. దీనికి సంపూర్ణ మద్దతు కూడా బహుజన రైతు కూలీ సంఘం ఇస్తుందని తెలిపారు.
