సంక్రాంతి సెలవులు ఇళ్ల భద్రత పై చర్యలు తీసుకోండి, జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా వెల్లడి,

ముఖ్యాంశాలు,

Kura Yadaiah| January ,10,2026

హిందు 9 న్యూస్ బ్యూరో :

సంక్రాంతి సెలవుల్లో ప్రజలు తమ ఇండ్ల పట్ల భద్రత చర్యలు తీసుకోవాలని జిల్లాలో కూడా పోలీసుల భద్రత కట్టుదిట్టం చేస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా వెల్లడించారు...

 Sp Vikarabad |వికారాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో తమ తమ ఇండ్ల పట్ల భద్రత చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమేరా వెల్లడించారు. స్వగ్రామాలకు ఇతర పట్టణాలకు మరియు దూరప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో ఇళ్లకు తాళం వేసి వెళ్లే సందర్భాలలో దొంగతనాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. జిల్లా వ్యాప్తంగా నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ముఖ్యంగా నివాస ప్రాంతాలు అపార్ట్మెంట్ గ్రామాలు పట్టణాలలో గస్తీ ముమ్మరం చేస్తామని ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా  చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.

పండగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు అమలు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. బంగారం ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని అలాగే పొరుగువారికి లేదా సమీప బంధువులకు తమ సమాచారం ఇవ్వడం అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్కు తెలియజేయడం అదనపు భద్రతా పొందవచ్చని తెలిపారు. పోలీస్ అధికారుల నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఎస్పి సూచించారు. గ్రామాలలో అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే డయల్ 100 కు లేదా వన్ వన్ టూ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *