ముఖ్యాంశాలు
Kura Yadaiah| February 8,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :

కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా నిలబడండి ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానంటూ తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు….
హిందు 9 న్యూస్( తాండూర్ 8):కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా నిలబడి చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే వార్డులతోపాటు తాండూర్ పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం రోజు 9 11 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పట్లోళ్ల నీరజ బాల్రెడ్డి, బంటు వేణుగోపాల్ చైతన్య ప్రశాంత్ లకు మద్దతుగా ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనేక సంక్షేమ పథకాలతో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం కొనసాగుతున్నదని ఇందిరమ్మ రాజ్యమంటే పేదల మధ్యతరగతి ప్రజల ఆకాంక్షల మేరకు కొనసాగే ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లతో పాటు ప్రతి ఇంటికి అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు రైతు రుణమాఫీ ఇలాంటి పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడ్డదని తెలిపారు. సాయిపూర్ 9 11 12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు నీరాజా బాల్ రెడ్డి , వేణు గోపాల్ , చైతన్య ప్రశాంత్, చేయి గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
