ప్రభుత్వం
Kura Yadaiah/January 8,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :

పెద్దేముల్ ఎంపీడీవో గా మండల పరిషత్ ఇటీవల సూపర్డెంట్ గా వచ్చిన వెంకటకృష్ణ బుధవారం రోజు ఇంచార్జి ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టారు…
పెద్దేముల్: పెద్దేముల్ మండల పరిషత్ ఇన్చార్జి ఎంపీడీవోగా
వెంకటకృష్ణ బాధ్యతలు చేపట్టారు. బుధవారం రోజు తన కార్యాలయం బాధ్యతలు స్వీకరించగా గతంలో పెద్దేముల్ ఎంపీడీవో గా పని చేసిన జర్నప్ప పదవి విరమణ పొందడంతో ఆ పోస్టు ఖాళీ ఏర్పడింది. అయితే స్థానికంగా ఈ పిఓ ఆర్ డి గా బాధ్యతలు చూస్తున్న రతన్ సింగ్ తాత్కాలిక ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం వెంకటకృష్ణ మండల పరిషత్ సూపర్డెంట్ గా బదిలీపై రావడంతో ఆయనకు ఇంచార్జి ఎంపీడీవో బాధ్యతలను ప్రభుత్వం కట్టబెట్టింది. దాంట్లో భాగంగా బుధవారం ఇంచార్జి ఎంపిటివోగా బాధ్యతలు చేపట్టారు.
