ఇంద్రవెల్లి ఆనెత్తుటి-గాయనికి45,ఏండ్లు,

విశ్లేషణ,

హిందు 9 న్యూస్ తెలంగాణ బ్యూరో/20/4/2026,

______మరో జలియన్వాలాబాగ్ ఇంద్రవెల్లి… ఆనెత్తుటి గాయానికి 45ఏండ్లు….

తెలంగాణ బ్యూరో : భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం ఉద్యమ బాటన రైతుకూలి సంఘం ఆధ్వర్యంలో 1981 ఏప్రిల్ 20న కదం తొక్కడంతో జనసంద్రంతో సభ నిండుకున్నది అక్కడ చేరుకున్న పోలీసులలో ఒక కానిస్టేబుల్ ఆదివాసి మహిళను అనుచితంగ ప్రవర్తించడంతో ప్రాణానికన్నా శీలం ముఖ్యమని భావించే ఆమహిళా చేతులో ఉన్న కొడవలితో దాడి చేయడంతో పోలీసులు రెచ్చిపోయి జరిపిన కాల్పుల్లో గోండు ప్రజలు లెక్కలేకుండా చనిపోయారు. ఇంద్రవెల్లిలో జరిగిన పోలీసుల కాల్పుల సంఘటనలో ఆదివాసులు హక్కులు ప్రపంచానికి తెలియడమే కాకుండా మరో జలియన్వాలాబాగ్. గా చరిత్రగా నిలిచింది పశ్చిమ బెంగాల్లో రాష్ట్రంలో నక్సల్ బరి గ్రామంలో భూస్వాములపై తిరుగుబాటుతో వెలుగులోకి వచ్చిన వారి ఉద్యమం శ్రీకాకుళం చేరుకొని భూమి భూక్తి విముక్తి కోసం రైతంగ పోరాటాలకు ఊపిరి పోసింది. కరీంనగర్ జిల్లాలో విద్యార్థి రైతంగా పోరాటాలు స్ఫూర్తితో జగిత్యాల జైత్రయాత్ర సాగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులకు (గోండు గిరిజనులకు)అండగా నిలిసింది. అర్ధ ఆకలితో బతుకు వెల్లదీసిన గోండులు ఆకలి,ఆనారోగ్యం బారిన పడి ప్రాణాలు కాపాడే వారు లేక దిగజారుతున్న బతుకులకు దిక్కు లేకపోవడం కుంగు బాటుకు గురి చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా విస్తరించిన అడవిలో వ్యాపారులు పటేల్ పట్వారి వ్యవస్థ చేస్తున్న, ఆగడాలు, దోపిడికి, ఆదివాసులు గురికావడంతో దిక్కులేక దిగులు పడుతున్న తరణంలో 1975లో అడుగుపెట్టిన పీపుల్స్ వార్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివాసులకు అండగా ఉండడం తో ఆకుల కల్లాలపై ఆదివాసుల పెత్తనం పెరగడం తో పొరకలుదొరలుగా పిలుచుకునే పీపుల్స్ వార్ ( ప్రజల యుద్ధం )ఆధ్వర్యంలో ,రైతు కూలి సంఘం ఉధ్యమించడంతో ఆదివాసులు పిలుచుకునే పొరకల దొరల అండతో అడవి పై భూమిపై మాదే హక్కు అంటూ జిల్లాలో పోడు భూములను దున్నుకోవడం ఉద్యమించ సాగారు. వేలాది ప్రభుత్వ భూములను కబ్జా చేసుకున్న పెత్తందారుల పెత్తనం కోల్పోయిన పాలకులు పటేల్ పట్వారిలకు ప్రభుత్వంకు కంటి నిండా కునుకు లేకుండా పోయింది.
జల్-జంగిల్-జమీన్ ఆదివాసీలు తమ భూములు, అడవి, హక్కుల కోసం ఉద్యమించారు. సీపీఐ యంఎల్ “పీపుల్స్ వార్ ( ప్రజలయుద్ధం) ఆధ్వర్యంలోని గిరిజన రైతు కూలీ సంఘం, ఆదివాసీలకు భూమి పట్టాల కోసం భూ ఆక్రమణలను నిరసిస్తూ ఇంద్రవెల్లిలో సభ ఏర్పాటు చేసింది.
అడవిపై హక్కుల కోసం ఆదివాసీలు ఈ సభకు పెద్ద సంఖ్యలో ఆదివాసీలు విల్లు, బాణాలు, కర్రలతో తరలివచ్చారు.

1981 ఏప్రిల్ 20 న ఆదివాసీలు నిరసన తెలుపుతుండగా పోలీసులు సభపై కాల్పులు జరిపారు. ఒక కానిస్టేబుల్‌ను చంపారని అందువల్లే కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.
అమరులైన గిరిజనులు ఘటనలో అధికారికంగా 13 మంది ఆదివాసీలు మరణించినట్లు ప్రకటించారు, కానీ అనధికారికంగా వందల మంది చనిపోయారని, చాలా మంది ఆదివాసీలు అడవుల్లోకి పారిపోయారని, కొందరు చనిపోగా వారి మృతదేహాలను కూడా పోలీసులు దహనం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
సభ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ సభలపై నిషేధం విధించారు, సభ విజయవంతం కోసం ఆదివాసులు అధిక సంఖ్యలో సభకు తరలి వచ్చినారు.

ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా మేధావుల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆదివాసీల భూ హక్కుల పోరాటాన్ని అణచివేయడానికి ఈ కాల్పులు జరిపారని విమర్శలు వచ్చాయి.
ఘటన జరిగిన చోట ఆదివాసీల అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు, దీనిని పోలీసులు 1986లో కూల్చివేసి, తర్వాత మళ్ళీ పునర్నిర్మించారు.
ఈ ఘటన జరిగి నేటికీ 45 ఏళ్లు, ఆదివాసీ ప్రజలకోసం చేసిన త్యాగాలకు ప్రతీకగా దూరం ప్రాంతాలనుండి చుట్టు గ్రామాల నుండి జాతర లాగ ప్రజలు ఎడ్ల బండ్ల పై ఇంద్రవెల్లికి వచ్చిస్తూపం వద్ద ప్రతి ఏట అమరుల త్యాగాలను ఎత్తి పట్టుతు చుట్టు ప్రాంతం ప్రజలు నివాళులు అర్పిస్తారు…………………………….. *బాలసాని రాజయ్య* *సినియర్ జర్నలిస్ట్* 9866102315

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *