పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేస్తా -ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ కు కృతజ్ఞతలు, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్,

ముఖ్యాంశాలు,

హిందు 9 న్యూస్ /వికారాబాద్ జిల్లా బ్యూరో 9/4/2026,

వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గా నియమించినందుకుగాను జిల్లా అధ్యక్షుడు ధారా సింగ్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ తెలిపారు…..

తాండూర్ : నా మీద నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన జిల్లా డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ అలాగే నాకు వెన్నంటి రాజకీయంగా ఎదిగించిన స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నూతనంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కావలి సంతోష్ ఈ సందర్భంగా  అన్నారు.

తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ తమపై పెంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి బలోపేతానికి ఎల్లవేళల కృషి చేస్తానని సంతోష్ కుమార్ తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని రక్తం చేశారు. పార్టీని ప్రజలకు మరింత దగ్గరగా చేసి ప్రజలు విశ్వాసాన్ని పెంపొందించే విధంగా కృషి చేస్తామని చెప్పారు.

తప్పకుండా పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చే విధంగా అందరం ఐక్యమత్యంతో కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వెంకటేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *