ఎన్నికలు
Kura Yadaiah| December 10,2015,
హిందు 9 న్యూస్ బ్యూరో :-

Election update | రేపే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనున్నాయి వేలుపు ను అంచనా వేసుకొని స్థితిలో అభ్యర్థులు ఉన్నారు…..
Election update వికారాబాద్ :- వికారాబాద్ జిల్లా మొదటి విడత ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుంది 11 తారీఖు ఉదయం ఏడు గంటలకు ఒంటిగంట వరకు ముగుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో జిల్లాలో త్రిముఖ పోటీ కనిపించడం లేదు ద్వి ముఖ పోటీ గట్టిగా కనిపిస్తుంది గ్రామాలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు పోటా పోటీగా సర్పంచ్ అభ్యర్థులుగా పోటీపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఆయా గ్రామాలలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకు గట్టి పోటీని ఇస్తుందనేది విశ్లేషకుల అంచనగా కనిపిస్తుంది. స్థానిక ఎన్నికలు కావడం వల్ల వ్యక్తిగత ఇమేజ్తోపాటు వ్యక్తి వెనుక ఉన్న నాయకులమనస్తత్వాలను ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. పార్టీ బల బలాలు ఇమేజ్ ని కూడా అంచనా వేసి ఓట్లు వేసుకునే సందర్భం ఉంటుంది. కానీ ఇప్పుడు పూర్తిగా గ్రామాలలో అభ్యర్థులను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతుంది. క్రాస్ ఓటింగ్ జరుగుతుందేమోనని అధికార పార్టీ వర్గాలలో అక్కడక్కడ బలంగా వినిపిస్తున్న మాట. ప్రతిపక్ష పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులు బలంగా అధికార పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులకు పోటీని ఇస్తున్నారు అనేది మరోవైపు వినిపిస్తున్న మాట.
ఈ సందర్భంలోనే వ్యక్తిగత ఇమేజ్ తో పాటు స్థానిక ఎన్నికలు కావడం వల్ల కొంత క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు సీనియర్ రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరో అంశం జిల్లాలో త్రిముఖ పోటీ బలంగా ఉంటుందని అనుకున్న అది సాధ్యపడలేకపోయినట్లు కనిపిస్తుంది బిజెపి పార్టీ చాలా తక్కువ గ్రామాలలో అభ్యర్థులను పోటికి దింపినట్లుగా కనిపిస్తుంది. పెద్దగా బిజెపి స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టి గెలుపు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎక్కడ కూడా కనిపిస్తే లేదు అనేది మరోపక్క ప్రజల్లో వినిపిస్తున్న వాదన. ఏది ఏమైనా మొదటి విడత స్థానిక పంచాయతీ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లుగా పోటాపోటీగా ఎన్నికలకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. మరి ఏది ఏమైనా ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఒక అంచనాలకు రాలేకపోతున్నారు.
