ఎన్నికలు, వికారాబాద్ ,
Kura Yadaiah| December 10,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :-

Election update| ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ తెలిపారు.
Election update|వికారాబాద్ :- గ్రామపంచాయతీ ఎన్నికలను నేపథ్యంలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన కులకచర్ల మండలానికి చెందిన పటేల్ చెరువు తండా ఎస్ జి టి మానస నీటూరు ప్రాథమిక పాఠశాల స్కూల్ అసిస్టెంట్ నసీం రెహనాలను అలాగే పెద్దేముల్ మండల ఎంపీపీ ఎస్ కు చెందిన స్కూల్ అసిస్టెంట్ అన్నపూర్ణ లను గ్రామపంచాయతీ ఎన్నికల అధికారులుగా నియమించడం జరిగింది.
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు అధికారుల సస్పెండ్,
అయితే ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన సందర్భంగా పటేల్ చెరువు తండా ఎస్ జి టి మానస నీటూరు ప్రాథమిక పాఠశాల స్కూల్ అసిస్టెంట్ నసీం రహేనాలు, పెద్దెముల్ మండల్ ఎంపీపీ ఎస్ కు చెందిన స్కూల్ అసిస్టెంట్ అన్నపూర్ణ లను సస్పెండ్ చేస్తున్నట్టు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ తెలిపారు.
