దివ్యాంగులు, అభివృద్ధి ,
Kura Yadaiah| January 1,2026
హిందు 9 న్యూస్ బ్యూరో :-

Happy new year celebration |జనవరి 2026 నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు వికలాంగుల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని అలాగే వికలాంగులు రాష్ట్రంలో ఐక్యత సాధించి కొత్త సంవత్సరంలో అభివృద్ధిలోకి రావాలని చైర్మన్ ఆకాంక్షించారు…..
Happy new year celebration, cm/హైదరాబాద్ :- జనవరి 2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.గురువారం రోజు తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర వికలాంగులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
దివ్యాంగుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేసిన చైర్మన్,
దివ్యాంగుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరించాలని ముఖ్యమంత్రి కి మరో మారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వికలాంగులు కూడా ఈ కొత్త సంవత్సరంలో ఐక్యతతో ఉండి అభివృద్ధికి బాటలు వేసుకుందామని రాష్ట్ర వికలాంగులకు పిలుపునిచ్చారు. తప్పకుండా జాతిలో ఐక్యత పెరిగితే అభివృద్ధి సాధ్యమవుతుందని మరో మారు వికలాంగులకు కోరారు.
