ముఖ్యాంశాలు
Kura yadaiah |January 21,2026,
హిందు 9న్యూస్ బ్యూరో :

గత సాధారణ ఎన్నికల్లో దివ్యాంగులకు 6000 పెన్షన్ వృద్ధులకు 4000 పెన్షన్ పెంచుతామని మేనిఫెస్టోలో మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రకటన ఉట్టిదేనా అంటూ మండిపడుతూ పెన్షన్లపై వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి మాట నిలబెట్టుకోవాలని చెరుకు నాగభూషణం డిమాండ్ చేశారు….
హైదరాబాద్ : దివ్యాంగుల 6000 పింఛన్, వృద్ధులకు 4000 పెన్షన్ గత సాధారణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిందని మరి పొందుపరిచిన ఇప్పటికీ వికలాంగుల పెన్షన్ వృద్ధుల పింఛన్ సంగతి ఏంటో? ప్రభుత్వం తేల్చకపోవడం దేనికి సంకేతం అని వికలాంగుల సీనియర్ నాయకుడు రాష్ట్ర కార్యదర్శి ఫేడ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకు నాగభూషణం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం రోజు డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డే ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో ఏర్పాటుచేసిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగుల 6000, పెన్షన్ సంగతి ఉత్తదేనా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేసేది ఎప్పుడో ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వికలాంగుల హక్కుల చట్టం సమర్థవంతంగా అమలు కావడం లేదు,
అలాగే వికలాంగుల హక్కుల చట్టం గతం కంటే ఇప్పుడు పూర్తిగా నీరు కారుతున్నదని గత ప్రభుత్వమైన చట్టాన్ని కొంతమేర సమర్థవంతంగా అమలు చేసిందని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయిలో చట్టాన్ని అమలు పరచడం లేదని చట్టాన్ని పూర్తిగా బ్రష్టు పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వికలాంగులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు విడుదల ఇప్పటివరకు ప్రభుత్వం నెరవేర్చకపోవడం శోచనీయమని ఇది వికలాంగుల జాతిని మోసగించడమేనని హాగ్రామ్ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం ఇందిరమ్మ ఇల్లు గ్రామ గ్రామాన అర్హులైన ప్రతి వికలాంగులకు అందినయని కానీ ప్రస్తుత ప్రభుత్వంలో గ్రామాలలో రాజకీయ కక్షల పేరుతో వికలాంగులను చిన్నచూపు చూస్తున్నారని ఇండ్ల విషయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంధుల బధిరాలా సమస్యలను తక్షణమే పరిష్కరించండి,
అందులు బదిరిల సమస్యలు తక్షణమే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నామమాత్రంగా కొంత బడ్జెట్ను కేటాయించి వికలాంగులను శాంత పరచడం కాదని వారి హక్కులను కాలరాయడమే అవుతుంది అని తెలిపారు. మా పైన సానుభూతి కాదు రాజ్యాంగపరంగా చట్టపరంగా రావాల్సిన దక్కాల్సిన హక్కులను వాటాలను వికలాంగులకు రాష్ట్రంలో పంచితే చాలని మంచి దేశాలని వికలాంగుల అభివృద్ధి సంక్షేమం అప్పుడు జరుగుతుందని సూచించారు.
వికలాంగుల కమిషనర్ కార్యాలయంలో వికలాంగుల పిటిషన్లకు మోక్షం ఎప్పుడు?
జిల్లాలలో వికలాంగుల సమస్యలు కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసిన ఇప్పటికి వాటిపైన సరియైన టైంలో చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతమో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. వికలాంగుల ఆస్తులు వికలాంగుల పై దాడులు వికలాంగులపై జరుగుతున్న దౌర్జన్యాల పట్ల కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకొని నెలలు గడుస్తున్నాయని ఇప్పటివరకు వాటిపైన స్పందించకపోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణమే చట్టాలపై గౌరవం ఉంటే రాజ్యాంగంపై నమ్మకం ఉంటే తగిన చర్యలు తీసుకొని అణగారిన వికలాంగుల జాతికి న్యాయం చేయాలని అప్పుడు ప్రభుత్వాలను అధికారులను వికలాంగుల జాతి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని ఆకాంక్షించారు. తక్షణమే ప్రభుత్వం మేనిఫెస్టోలు ఆనాడు ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ పెంపు విధానాన్ని చేపట్టాలని జాబ్ క్యాలెండర్ను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వికలాంగుల కమిషన్ను ఏర్పాటు చేసి వికలాంగుడ్ని కమిషనర్ గా నియమించాలని ఆయన పలు డిమాండ్లను లేవనెత్తారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వికలాంగుల సమైక్య నాయకులు మోరిగాడి నరసింహ గుత్తికొండ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
