రాజకీయం
K, Yadaiah. August 23,2025

కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో యూరియా పేరుతో రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం పై రాజకీయ సంక్షోభం పేరుతో కుట్రలు చేస్తున్నదని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఏ సంజీవ్ ముదిరాజ్ అన్నారు….
హైదరాబాద్ :తెలంగాణలో యూరియా పేరుతో కొనసాగుతున్న కొరత, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి సంకేతం కాదని అసలు విషయం ఏంటంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుండడంతో దానిని బదనాం చేయడానికి కావాలని సృష్టించిన రాజకీయ కుట్రనేనని టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏ సంజీవ్ ముదిరాజ్ అభిప్రాయపడ్డారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే తెలంగాణ ప్రభుత్వం సుమారు 7 లక్షల టన్నుల యూరియా బఫర్ స్టాక్ ను సిద్ధంగా ఉంచి రైతుల అవసరాలను ముందుగానే తీర్చడానికి సన్నదమైందని సంజీవ ముదిరాజ్ పేర్కొన్నారు. కేంద్రం సరఫరా చేసే యూరియా రాష్ట్ర డిపాజిట్ సెంటర్లకు చేరి మార్క్ పేడ్ గోదాముల్లో నిలువచేసి అక్కడ నుంచి పాక్స్ రైతు సేవ కేంద్రాలు మరియు ప్రైవేట్ డీలర్లకు, 60:40 నిష్పత్తిలో పంపిణీ చేసే పారదర్శక వ్యవస్థను అమలు చేసిందని అన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతయుతంగా ముందుగానే చర్యలు తీసుకున్నదని స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. అయితే తెలంగాణకు కేటాయించిన కోటను సరిపడంత విడుదల చేయకుండా కేంద్రం కావాలని కృత్రిమ కొరతను సృష్టిస్తుందని ఆరోపించారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీన పరచాలని చూస్తున్నదని కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. యొక్క కేటాయింపులు చేసినప్పటికీ తక్కువగా రాష్ట్రానికి సరఫరా చేసి రైతులను అవసరంలేని భయాందోళనలు కలిగించడం చేస్తుందని అన్నారు. సహకార సమైక్య పద్ధతిని అనుసరించాల్సిన చోట కేంద్రం యూనియన్ రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఎంపీలు ఈ అంశంపై ఢిల్లీలో పలుమార్లు ప్రాతినిధ్యం వహించి మాట్లాడిన పరిస్థితిని మనం చూసామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఏఐసీసీ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణ రైతుల తరఫున నిరసన కార్యక్రమంలో గొంతు విప్పియారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయిలోను జాతీయస్థాయిలోనూ రైతుల తరఫున పోరాటం చేస్తున్నదని తెలిపారు. సంక్షోభం మధ్యలో బి ఆర్ ఎస్ రాజకీయ స్వార్థం మాట్లాడడం రైతులను మరింత అవమానానికి గురిచేసిందని అన్నారు. ఈ సంక్షేపం రాష్ట్ర ప్రభుత్వం స్వార్థం ఏమి కాదు ఇది కేంద్రం చూపిస్తున్న అసహకత బిఆర్ఎస్ ప్రదర్శిస్తున్న స్వార్థం బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కావాలని కొరత సృష్టిస్తుందని ఆరోపించారు. తెలంగాణ రైతులు నిజాన్ని తెలుసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలిచింది పోరాడింది రక్షించింది కేంద్రం కుట్ర పూరిత ఆలోచనలు చేస్తున్నదని తెలిపారు. తెలంగాణ రైతులకు న్యాయం జరగడం న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని సంజీవ్ ముదిరాజ్ తెలిపారు
