శ్రీశైల భక్తులకు అన్నదానం, ప్రశంసలు అందుకుంటున్న శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్,

ఆధ్యాత్మికం 

Kura yadaiah| January 2, 2026,

హిందు 9న్యూస్ :-

ప్రధాన పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి వెళ్లే భక్తులకు అన్నదాన  కార్యక్రమం నిర్వహించినట్లు శ్రీ సాయి పుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత శంకర్ యాదవ్ కుటుంబ సభ్యులు తెలిపారు….

Srisailam|తాండూర్ :-  ప్రధాన పుణ్యక్షేత్రం శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లే భక్తులకు తాండూర్ కు చెందిన శ్రీ సాయి పుత్ర హోమ్స్  అండ్ డెవలపర్స్ శంకర్ యాదవ్ కుటుంబం ప్రతి ఏటా పాదయాత్రగా వెళ్లే భక్తులకు అన్నదానం కార్యక్రమం చేపడతారు. అయితే ఈసారి కూడా తాండూర్ నుండి శ్రీశైలానికి వెళ్లే భక్తులను దృష్టిలో ఉంచుకొని కొడంగల్ రోడ్ ఉడమేశ్వరం గ్రామ పరిధిలోను భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సేవా వ దృక్పథంతో ఏర్పాటు చేస్తున్న అన్నదాన కార్యక్రమం రోజురోజుకు భక్తుల చేత శంకర్ యాదవ్ కుటుంబం ప్రశంశాల అందుకుంది.

శ్రీ సాయి పుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ సేవా కార్యక్రమాలకు ప్రజల్లో ఎనలేని ఆదరణ,

శ్రీ సాయిపుత్ర హోమ్ అండ్ డెవలపర్స్ చేసే సేవా కార్యక్రమాలకు  ప్రజల్లో మంచి ఆధార అభిమానాలు పెరుగుతున్నాయి. భక్తుల్లో ప్రతి ఏటా శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ వారు ఆధ్యాత్మిక చింతన కూడా పెంచుతూ వస్తున్నారు.  సిరిగిరి పేట్ శేఖర్ కేశవరావు రమణారెడ్డి తదితరుల నాయకత్వంలో శుక్రవారం రోజు అన్నదాన కార్యక్రమాలు శంకర్ యాదవ్ కుటుంబంతో కలిసి ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో హనుమయ్య, చంద్రకళ, వైష్ణవి, తాండూర్ బీసీ సంఘం , కన్వీనర్ రాజ్ కుమార్, వినోద్ కుమార్ మనోహర్ యాదవ్ బంటుమల్లప్ప వేణుగోపాల్ రెడ్డి శ్రీనివాస్ మల్లేష్ యాదవ్ అరుణ్ కుమార్ సురేష్ ప్రశాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *