అభివృద్ధి, ప్రభుత్వం
Kura Yadaiah September 26,2025,


వికారాబాద్ జిల్లలోని రోడ్లతోపాటు తాండూర్ నియోజకవర్గ రోడ్ల అభివృద్ధి కోసం మరమ్మత్తుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డిలు విజ్ఞప్తి చేశారు………
హిందు 9 న్యూస్ /వికారాబాద్ ;వికారాబాద్ జిల్లాలో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం రోజు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తోపాటు తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. తాండూర్ నియోజకవర్గ లోని రోడ్లతో పాటుగా మన్నెగూడ వికారాబాద్ తాండూర్ జహీరాబాద్ బీదర్ రోడ్డు అలాగే తాండూర్ పెద్దెముల్ కోటపల్లి మోమిన్పేట్ సదాశివ పెట్ రోడ్డు మారేపల్లి మదనంతాపూర్ మరియు రొంపల్లి బంటారం రోడ్డు రోడ్లతో పాటు గా కోకట్ మోమిన్ పేట్ బుద్యేరా రోడ్డు వికారాబాద్ మోమిన్పేట్ రోడ్డు కొత్తగాడి బంటారం కేసారం తురుమామిడి మరియు ఇతర రోడ్ల అభివృద్ధి కోసం ప్రజల సురక్షితమైన ప్రయాణం కోసం నిధులు మంజూరు చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. కలిసిన వారిలో సీనియర్ నాయకులు ఉత్తంఛన్ మాణిక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
