దివ్యాంగులు
Kura Yadaiah December 30,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :-

అసెంబ్లీలో వికలాంగుల సమస్యలపై చర్చ చేపట్టాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరినట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ తెలిపారు.
వికారాబాద్ జిల్లా :- తెలంగాణ అసెంబ్లీలో వికలాంగుల సమస్యలపై ప్రత్యేక చర్చి చేపట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ను భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు జి రాజేష్ కోరారు.మంగళవారం రోజు ఉదయం హైదరాబాదులో భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు పూర్తి కావస్తున్న రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నికల సైతం పాలుపంచుకున్నారని ఇప్పటివరకు వికలాంగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్నట్లుగానే ఉన్నాయని అన్నారు.
6000, పెన్షన్ పెంచేది ఎప్పుడు?
వికలాంగులకు 6000 పెన్షన్ పెంచుతామని ఆర్టీసీలు ఉచిత ప్రయాణ సౌకర్యం ఇస్తామని వికలాంగుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు పరుస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పట్ల తగిన శ్రద్ధ తీసుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికీ గ్రామాలలో వికలాంగులకు ఇందిరమ్మ ఇండ్లు విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది ఈ విషయాన్ని రాష్ట్ర కార్పోరేషన్కు కూడా తెలియపరిచిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అలాంటప్పుడు వికలాంగులకు ఎలా న్యాయం జరుగుతుందో చెప్పాలని అన్నారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ కరబా జిల్లా అధ్యక్షులు సుధీర్ దర్శి కావలి నరసింహులు లాల్ సింగ్ బండి శ్రీనివాస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
