పోలీసుల ఆరోగ్య సంరక్షణే, మా ప్రాధాన్యత, జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా,

ముఖ్యాంశాలు, భద్రత,

Kura Yadaiah January 19,2026,

హిందు 9 న్యూస్ బ్యూరో :

జిల్లాలోని పోలీసుల ఆరోగ్యంగా సంరక్షణే మా ప్రధాన కర్తవ్యం అని పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే సమర్థవంతమైన సేవలు ప్రజలకు అందించగలుగుతారని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా అన్నారు…..

వికారాబాద్ జిల్లా :జిల్లా పోలీస్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణ మా ప్రాధాన్యత అంటూ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆరోగ్య శిబిరం ప్రారంభిస్తూ జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా అన్నారు. సోమవారం రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది హోమ్ గార్డ్స్ కుటుంబ సభ్యుల కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం మరియు పోలీస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని ప్రసంగించారు. వికారాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు జిల్లా ఏఆర్ విభాగం మరియు హోంగార్డులకు వారి కుటుంబ సభ్యులకు ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మానసిక శారీరిక ఒత్తిడికి గురయ్యే పోలీసుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం వారిలో మానసిక ధైర్యాన్ని దృఢత్వాన్ని నింపడమే పోలీస్ శాఖ ప్రధాన కర్తవ్యం అని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

నిపుణులైన డాక్టర్ల చే ఉచిత వైద్య శిబిరం,

ఈ శిబిరంలో నిపుణులైన డాక్టర్లచే ఈసీజీ రక్తపోటు బిపి షుగర్ లెవెల్స్ బాడీ మాస్ హృదయ సంబంధ పరీక్షలతో పాటు జనరల్ ఫిజీషియన్ గైనకాలజిస్ట్ స్త్రీ రోగ అన్ని పనులు ఆర్థోపెడిక్ ఖిల్లా వ్యాధి నిపుణులు కార్డియాలజిస్ట్ తదితర అత్యున్నత ప్రమాణాలతో పరీక్షలు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. పోలీసులు తమ ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించకూడదని పోలీస్ సిబ్బంది శారీరిక మానసిక దృఢంగా ఉండేందుకే ప్రజలకు మరింత వేగవంతమైన సమర్థవంతమైన న్యాయమైన సేవలను అందించడం కోసం పోలీసులు తమ ఆరోగ్యాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవనశైలి ఒత్తిడి నేపథ్యంలో ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం పౌష్టికాహారం తీసుకోవడం విశ్రాంతి కూడా తీసుకోవడం అవసరం ఉందని ఆమె పోలీసులకు సూచించారు.

కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి రాములు నాయక్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వర్ణకుమారి డిఆర్సిబి డిఎస్పి జానయ్య డిఎస్పి శ్రీనివాసులు వికారాబాద్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి ఏఆర్డిఎస్పి వీరేష్ ఏవో ఖాజామైనోదీన్ ప్రముఖ వైద్యులు సత్యనారాయణ రాజశేఖరరెడ్డి జగదీష్ చంద్రకాంత్ చిరంజీవి ఇల్లతోపాటు ప్రభుత్వాస్పిటల్ కాంటినెంటల్ డిఆర్ అగ్రవాల్ మాన్స్ విషన్ సాయి డెంటల్ డాక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *