భద్రత
Kura Yadaiah /December 30,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :-

- నూతన సంవత్సర వేడుకలకు నో డీజే వేడుకల పేరుతో బైకులపై పెద్దపెద్ద సౌండులు ఈ టీజింగ్ లకు పాల్పడితే కఠినమైన చర్యలు,
- జిల్లావ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పోలీసులు,
- ఫామ్ హౌస్ లు రీస్టార్ట్ లు వేడుకల సందర్భంగా ముందుగా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి,
- ఎస్ హెచ్ ఓ ల జిల్లా వ్యాప్తంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు
- బహిరంగ ప్రదేశాలలో మద్యపానం నిషేధం,
- వేడుకల పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు,
Police |నూతన సంవత్సర వేడుకలకు డీజే లను వాడకూడదని వేడుకల్లో బైకులపై పెద్ద పెద్ద సౌండ్ ల చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దని ఈవ్ టీజింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేసినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమేహ్రా వెల్లడించారు……
Police |వికారాబాద్ జిల్లా :-నూతన సంవత్సర వేడుకలకు డీజే కు పర్మిషన్ లేదని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా డీజే వాడకూడదని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమేహ్రా వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు అలాగే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీస్ నిబంధనలో ఎవరైనా అతిక్రమించి ప్రవర్తిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలు పెద్ద సంఖ్యలో ఉన్న ఫామ్ హౌస్ లో రీస్టార్ట్ లు మరియు పర్యాటక ప్రాంతాల యజమానులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం సూచించిన సమయపాలనను కచ్చితంగా పాటించాలని ఎస్పీ ఆదేశించారు.
మాదకద్రవ్యాల అక్రమ మద్యం సరఫరా లేదా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలే,
నూతన సంవత్సర వేడుకల్లో మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వేడుకల పేరుతో మాదకద్రవ్యాల వినియోగం అక్రమ మధ్యమం సరఫరా లేదా ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అతి ఉత్సవంతో అర్ధరాత్రి వేళ ద్విచక్ర వాహనాలపై అతివేగంగా వెళ్లడం పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టడం వంటి నేరాలను సహించేది లేదని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం పూర్తిగా నిషిద్ధం చేయడం జరిగిందని పేర్కొన్నారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో ఎస్ హెచ్ ఓ లు ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు,
జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న ఎస్హెచ్వోలు ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తారని వేడుకల ముసుగులో ఎక్కడైనా సంఘటనలు జరిగితే పూర్తిగా కఠినమైన చర్యలు ఉంటాయని గట్టిగా హెచ్చరించారు.

ఎస్ హెచ్ ఈ టీం అధికారులు నిశితంగా వేడుకలను గమనించాలని వికారాబాద్ జిల్లా ప్రజలు కూడా పోలీసులకు వేడుకల సందర్భంగా సహకరించాలని కోరారు.
