వ్యవసాయం
Kura Yadaiah|December 29,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :-

- కోటపల్లి ప్రాజెక్టు కుడికాలువ పూర్తిస్థాయి మరమ్మత్తులు,
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కుడికాలువ కింద ఉన్న రైతులెవ్వరు యాసంగి పంటలు వేసుకోవద్దు,
- రైతుల సంక్షేమార్గం ప్రభుత్వ ఆదేశాలను అందరు పాటించాలన్న ఏఈఓ,
Agriculture|ప్రభుత్వం కోటపల్లి ప్రాజెక్టు కుడి కాలువ యొక్క పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టడం వల్ల వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కుడి కాలువ ఆయకట్టు కింద ఉన్న రైతులందరూ యాసంగి వరి పంట వేసుకోవద్దని రైతులకు సూచించారు……
Agriculture|పెద్దేముల్ :- కోటపల్లి ప్రాజెక్ట్ కుడి కాలువ కింద రైతుల యాసంగి పంటకు ప్రభుత్వం సెలవు ప్రకటించిందని మంబాపూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తారణ అధికారి చంద్రకళ సోమవారం రోజు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే కోటపల్లి ప్రాజెక్టు కుడి కాలువ పనులను ప్రభుత్వం పూర్తిస్థాయి మరమ్మతులు చేపడుతున్నందు వల్ల కుడి కాలువ ఆయకట్టు రైతుల యాసంగి వరి పంటకు ప్రాజెక్ట్ నుండి నీళ్లు వదలడం సాధ్యం కాదని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రకటించి ఉన్నారని ఆమె పేర్కొన్నారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కోటపల్లి ప్రాజెక్టు కుడి కాలువ ఆయకట్టు కింద ఉన్న రైతులు ఈసారి యాసంగి వరి పంట వేసుకోవద్దని రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారి సూచించారు.
ప్రభుత్వ సూచనలను రైతులందరూ పాటించాలన్న ఏఈఓ,
ఒకవేళ రైతులు పంట వేసుకుంటే నీరు అందక రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. రైతుల సంక్షేమార్ధం ప్రభుత్వ సూచనలను రైతులందరూ కూడా పాటించాలని కోరారు.
