మృతుడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ బందెప్ప అంత్యక్రియలకు, అప్పన్న హస్తనందించిన, వైస్ చైర్మన్ సాయిని నారాయణరెడ్డి, నరేందర్ స్టేట్,

 

Helping|   కోటపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మృతుడు బందెప్పకు నివాళులు అర్పించి  తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ అంత్యక్రియల కోసం ఆర్థిక  సహాయం అందించినట్లు మార్కెట్ కమిటీ  వైస్ చైర్మన్ సాయి నీ నారాయణరెడ్డి నరేందర్లు తెలిపారు.

పెద్దేముల్: కళ్ళ ముందరే ఒకరు చస్తుంటే కల్లప్పగిచ్చి చూసే వాళ్లు ఈ లోకంలో అనేకం, పాపం అని పక్కింటి వాడికి పచ్చిపులుసు పోయని వాళ్ళు ఉన్నా ప్రస్తుత నేటి సమాజంలో కూడా మనుషులుగా మానవ జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉండాలనే ఆలోచనతో ఆశయం తో, ముందుకు వస్తున్న సందర్భం అక్కడక్కడ మనకు ఎక్కడో ఒక కాడ  కోటపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, నరేందర్ లాంటి వ్యక్తుల రూపంలో మానవత్వం మళ్లీ మళ్లీ ఉద్భవిస్తూనే ఉంటుంది. మళ్లీ  తన కమిటీలో ఒక సహచరుడిని కోల్పోయిన వార్త చెవిలో పడ్డదేమో, హుటాహుటిన వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం ఇందూర్ గ్రామానికి చెందిన జే బందెప్ప కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా ఉంటూ ప్రజలకు తనకు తెలిసిన సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల అభిమానాన్ని పార్టీ నమ్మకాన్ని పొంది  ఇటీవల కోటపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా జే, బందెప్ప నియమితులయ్యారు.

మృతుని స్వగృహం ఇందూర్ లోని దృశ్యం

కానీ ఆ సంతోషం ఆ పదవి బందెప్ప జీవితంలో  ఎన్ని రోజులు  నిల్వ లేకపోయింది. గత వారం రోజుల నుండి అనారోగ్యానికి గురై శనివారము రోజు ఆరోగ్యం మరింత క్షీణించడంతో తాండూర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్న సమయంలోనే బందెప్ప మృతి చెందినట్లు తెలుసుకున్న కోటపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాయిని నారాయణరెడ్డి, చైర్మన్ గడ్డ కింది అంజయ్యతో కలిసి హుటాహుటిన ఇందూర్ గ్రామానికి వెళ్లి అనారోగ్యంతో మృతి చెందిన కోటపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మృతుడు బందప్పకు నివాళులు అర్పించి బంధెప్ప కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపినట్లు నారాయణరెడ్డి తెలిపారు. తనకు నిజజీవితంలో ఇలాంటి సందర్భాలలో చేస్తున్న సహాయం మళ్లీ గుర్తుకొచ్చిందమో నారాయణరెడ్డి కి. మృతుని అంత్యక్రియల నిమిత్తం 5000, రూపాయలను  వైస్ చైర్మన్ సాయిని నారాయణరెడ్డి, ఇవ్వగా, అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ సేట్ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందించామని నారాయణరెడ్డి తెలిపారు. బందప్ప చాలా కాలం నుండి కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ పార్టీకి మంచి విధేయుడుగా కొనసాగారని అటు ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ తనకు నచ్చిన ప్రజలు మెచ్చిన సేవా కార్యక్రమాలను అందిస్తూ వస్తుండేవాడని అన్నారు. ఏది ఏమైనా ఇటు రైతులకు అటు పార్టీకి ప్రజలకు బందప్ప మృతి తీరని లోటు అని  వారు  పేర్కొన్నారు.

చిన్నవయసులోనే కాలం కాటు వేయడం చాలా బాధ అనిపించిందని తప్పకుండా బందెప్ప పార్టీకి ,మార్కెట్ కమిటీకి అందించిన సేవలను గుర్తించుకుంటామని  బందప్ప కుటుంబానికి ప్రభుత్వం ,పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో సంప్రదించి బందెప్ప కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని చైర్మన్ అంజయ్య వైస్ చైర్మన్ నారాయణరెడ్డిలు, నరేందర్  లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు కుల పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *