వికలాంగులు ,
K, Yadaiah/August/28,2025,

తాండూరులో వికలాంగుల హక్కుల పోరాట సమితి 18వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ వికలాంగులు ,పుష్పమాల వేసి నివాళులు అర్పించారు……
వికారాబాద్ జిల్లా: తాండూరులో వికలాంగుల హక్కుల పోరాట సమితి 18వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్, జిల్లా ఉపాధ్యక్షులు పి నర్సింలు వికలాంగుల నేతలు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

వికలాంగుల హక్కుల పోరాట సమితి నేటికీ ఆవిర్భవించి 18 సంవత్సరాలుగా వస్తున్నదని ఈ నేపథ్యంలో వికలాంగుల కోసం వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం వికలాంగుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసి పింఛన్ పెంపు విధానం నుండి అనేక హక్కులకు పరిరక్షించిందని మల్లికార్జున్ తెలిపారు. ఇకమీదట కూడా వికలాంగులు హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం చేయబోతుందని తెలిపారు. కార్యక్రమంలో చందు ముష్టి కృష్ణ అశోక్ అనంతయ్య పాష ఖలీల్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
