స్వాతి హత్యను ఖండించిన పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి అనసూయ, వై గీత, పరువు హత్యగా భావించి కఠినంగా శిక్షించాలన్న పిఓడబ్ల్యూ నేతలు,

నేరం

K, Yadaiah| August|28, 2025

కామారెడ్డి గూడ కు చెందిన స్వాతి హత్య చాలా దారుణమైన ఘటన అని, ఈ హత్య ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పిఓడబ్ల్యు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి అనసూయ వై గీతలు తెలిపారు…..

వికారాబాద్ :  హైదరాబాదులో ఇటివల హత్యకు గురైన వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడ కు చెందిన స్వాతి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పి ఓ డబ్ల్యు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి అనసూయ వై గీతలు తెలిపారు. మంగళవారం రోజు స్వాతి స్వగ్రామమైన వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడెంలోని తన నివాసాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు జి, అనసూయ , వై గీత లు మాట్లాడుతూ అదే గ్రామానికి చెంది ఇటీవల  హత్యకు గురైనా  స్వాతి కిందిస్థాయి కులం కావడంతో, మహేందర్ రెడ్డి వీరి ఇరువురి  ఇండ్లు కూడా పక్కపక్కనే ఉండడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు స్వాతి కుటుంబ సభ్యులు తమకు తెలిపారని  పేర్కొన్నారు. అయితే మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు కింది కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు అవమానంగా భావించి వారిని ఊర్లో లేకుండా కుట్రపూరితంగా హైదరాబాద్కు పంపించినట్లు స్వాతి కుటుంబ సభ్యులు తమతో  తెలిపినట్లు జి అనసూయ, గీతలు తెలిపారు . చివరకు పక్క ప్రణాళికతో ఆ అమ్మాయిని  హత్య చేసినట్లు అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. కాబట్టి ఇది పరువు హత్యగా భావించి  మహేందర్ రెడ్డిని హత్య కు సహకరించిన వ్యక్తులు ఎవరైనా ఉన్న వారిని కూడా కఠినంగా శిక్షించాలని ఈ హత్యపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకురాలు భారతీయ ప్రేమలత ప్రభావతి అంజమ్మ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *