అక్రమ ఇసుక దారులపై- మెరుపు దాడులు చేసిన టాస్క్ ఫోర్స్, నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు స్పష్టం చేసిన- జిల్లా ఎస్పీ, శ్రీమతి స్నేహమెహ్రా,

ముఖ్యాంశాలు, చట్టం ,

Kura Yadaiah |January 29,2026,

హిందు 9 న్యూస్ బ్యూరో :

సీజ్ చేసిన ట్రాక్దృటర్ల దృశ్యం
జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా

Sp Vikarabad |వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో నిబంధనలకు విరుద్ధంగా  నాలుగు టాక్టర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రవాణదారులపై జిల్లా టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు చేసి నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా వెల్లడించారు…….

Sp Vikarabad |బషిరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రవాణదారులపై జిల్లా టాస్క్ఫోర్స్ మెరుపు దాడులు చేసి నాలుగు టాక్టర్లను సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా వెల్లడించారు. గురువారం రోజు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో మంతటి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు వచ్చిన ముందస్తు సమాచారంతో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశానుసారం జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి నాలుగు ట్రాక్టర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్న సదరు ట్రాక్టర్లను వెంటనే చిజ్ చేసి బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఆమె పేర్కొన్నారు.

ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు డ్రైవర్లతో పాటు ట్రాక్టర్ల యజమానులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా మాట్లాడుతూ జిల్లాలో అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా తరలించడం చట్టరీత్య నేరమని ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కొనసాగుతుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *