ఖైరతాబాద్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో, రాష్ట్ర మహిళా న్యాయవాదుల సదస్సును జయప్రదం చేయండి, టి లక్ష్మీదేవి,

ముఖ్యాంశాలు,

Kura Yadaiah/ February 28,2026

హిందు 9 న్యూస్ బ్యూరో :

హైదరాబాదులోని ఖైరతాబాద్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ లో ఫిబ్రవరి 28న ,మహిళా న్యాయవాదులు ఎదుర్కొంటున్న వివక్షతను సమస్యలపై నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సుకు రాష్ట్ర మహిళా న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, మాజీ విప్లవ యోధులు శాంతి చర్చల ప్రతినిధి, జనశక్తి నేత అమరుడు రియాజ్ సహచరి” ఐ ఎల్ పి ఏ “రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీదేవి పిలుపునిచ్చారు…

హిందు 9 న్యూస్ (హైదరాబాద్ 28,)దేశ జనాభాలో 50% మహిళలకు రాజ్యాంగ రక్షణలో ఉన్నప్పటికీ పాలనలో ప్రతికాత్మక భాగస్వామ్యాన్ని ఇప్పటికీ ఇంకా ఎదుర్కొంటున్నారని ఇలాంటి వివక్షతలను ఎదుర్కోవాలంటే ఫిబ్రవరి 28 , ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఖైరతాబాద్ ఇండియన్ ఇంజనీర్స్ భవనం లో నిర్వహించే మహిళ న్యాయవాదుల తెలంగాణ రాష్ట్ర సదస్సుకు పెద్ద ఎత్తున మహిళా న్యాయవాదులు పాల్గొని జయప్రదం చేయాలని ఐ ఎల్ పి ఏ రాష్ట్ర అధ్యక్షులు టి లక్ష్మీదేవి పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.

ఇట్టి మహిళా న్యాయవాదుల సదస్సుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అలాగే జస్టిస్ తిరుమల దేవి ప్రత్యేక ఆహ్వానితులుగా ఐ ఎల్ పి ఏ జాతీయ అధ్యక్షురాలు సుజాత చౌదంటే, రిటైర్డ్ జడ్జి జస్టిస్ జి రాధా రాణి ఆంధ్రప్రదేశ్ న్యాయవాది ఆర్ గంగాభవాని ఇండియన్ డిఫెన్స్ అధికారి పి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొని మహిళా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రసంగిస్తారని లక్ష్మీదేవి పేర్కొన్నారు.

ఇట్టి కార్యక్రమానికి హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో ఉన్న మహిళా న్యాయవాదులు ఫిబ్రవరి 28 సాయంత్రం 6 గంటలకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో సమావేశానికి హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *